శ్రీనిధి క్యూట్ నెస్ కి మనోళ్లు పడిపోయారుగా..?
కె.జి.ఎఫ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన భామ శ్రీనిధి శెట్టి. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నా కూడా కెరీర్ ఎందుకో ఒక రేంజ్ లో సాగలేదు.
By: Tupaki Desk | 25 April 2025 8:11 PM ISTకె.జి.ఎఫ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన భామ శ్రీనిధి శెట్టి. ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నా కూడా కెరీర్ ఎందుకో ఒక రేంజ్ లో సాగలేదు. బహుశా అమ్మడు కూడా వచ్చిన ప్రతి సినిమా చేసేద్దాం అన్నట్టు కాకుండా సెలెక్టెడ్ గా వెళ్లాలని అనుకుంది కాబోలు.. కె.జి.ఎఫ్ రెండు సినిమాల తర్వాత చియాన్ విక్రమ్ తో కోబ్రా సినిమా చేసింది శ్రీనిధి. ఐతే 3 సినిమాలు మాత్రమే చేసినా సౌత్ ఆడియన్స్ లో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.
సినిమాల కన్నా శ్రీనిధి ఫోటో షూట్స్ కి ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం అమ్మడు న్యాచురల్ స్టార్ నానితో హిట్ 3 సినిమాలో నటించింది. సినిమాలో ఎంత వైలెన్స్ ఉందో అంతే ప్రేమ రొమాన్స్ ఉందని అనిపిస్తుంది. సినిమాలో శ్రీనిధి పాత్ర ఎంతసేపు ఉంటుంది అన్నది తెలియదు కానీ నాని, శ్రీనిధి జోడీ స్క్రీన్ మీద ఆడియన్స్ కు మంచి ఫీల్ వచ్చేలా చేస్తుందని అనిపిస్తుంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ తో మంచి బజ్ వచ్చింది.
ముఖ్యంగా సినిమా చేయడం ఒక ఎత్తు ప్రమోషన్స్ చేయడం మరో ఎత్తు అనేలా ఉన్న ఈ టైం లో నానితో ఈక్వల్ గా అన్ని ప్రమోషనల్ యాక్టివిటీస్ లో శ్రీనిధి పాల్గొంటుంది. హైదరాబాద్ తో మొదలు పెట్టి, తమిళ్, కన్నడ, మలయాళం, బాలీవుడ్ కోసం ముంబై ఇలా అన్ని ఏరియాల్లో కూడా హీరోతో పాటే తను కూడా వెళ్లింది శ్రీనిధి. సినిమా అంటే తనకున్న కమిట్మెంట్ ఎలాంటిది అనేది ప్రూవ్ చేస్తుంది అమ్మడు.
అంతేకాదు ఈ ప్రమోషన్స్ టైం లో శ్రీనిధి క్లిప్స్, ఫోటోస్ ఆమె క్యూట్ నెస్ ని తెలియచేస్తున్నాయి. హిట్ 3 ప్రమోషన్స్ లో శ్రీనిధి ఫోటోలు, వీడియోలనే సెపరేట్ చేసి సోషల్ మీడియాలో ఆమె ఫాలోవర్స్ వైరల్ చేస్తున్నారు. స్టార్ కటౌట్ శ్రీనిధి నెక్స్ట్ బిగ్ స్టార్స్ తో చేసేలా ఛాన్స్ ఇవ్వండి అంటూ ఆమె తరపున రిక్వెస్ట్ లు చేస్తున్నారు. ఏది ఏమైనా చేసిన 3 సినిమాలతోనే యూత్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ తెచ్చుకోవడం చూస్తుంటే సరైన సినిమాలు పడితే మాత్రం శ్రీనిధి పేరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో వినిపించేలా ఉందనిపిస్తుంది. శ్రీనిధి ఖాతాలో హిట్ 3 సక్సెస్ పడితే మాత్రం ఆమెకు తెలుగు నుంచి ఇంకా మరెన్నో ఛాన్స్ లు వస్తాయి. ప్రస్తుతం అమ్మడి ఓ పక్క సిద్ధు జొన్నలగడ్డతో తెలుసు కదా సినిమా చేస్తుందని తెలిసిందే.
