Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్‌కి ఆ బాధ లేదట!

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన 'హిట్‌ 3' విడుదలకు సిద్ధం అయింది. మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమాలో నానికి జోడీగా కేజీఎఫ్‌ స్టార్‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   30 April 2025 4:00 PM IST
Srinidhi Shetty Opens Up About KGF Impact and Career Setbacks
X

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన 'హిట్‌ 3' విడుదలకు సిద్ధం అయింది. మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమాలో నానికి జోడీగా కేజీఎఫ్‌ స్టార్‌ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటించిన విషయం తెల్సిందే. కేజీఎఫ్‌ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్న ఈ అమ్మడు హిట్‌ 3 తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిట్‌ 3 సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్న ఈ అమ్మడు టాలీవుడ్‌లో మరిన్ని సినిమాల్లో నటించాలని ఆశ పడుతోంది. ఇటీవల హిట్ 3 సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. నానితో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. అంతే కాకుండా కేజీఎఫ్ సినిమా గురించి కూడా స్పందించింది.

మీడియా సర్కిల్స్‌లో కేజీఎఫ్‌ సినిమాలో ప్రాముఖ్యత లేని పాత్రలో నటించడం వల్లే శ్రీనిధి శెట్టికి ఆఫర్లు రావడం లేదు అనే ప్రచారం జరిగింది. కేజీఎఫ్‌ వంటి బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమా తర్వాత కూడా ఈ అమ్మడు పెద్దగా ఆఫర్లు దక్కించుకోవడం లేదంటే ఆమెకు ఆ సినిమా తెచ్చి పెట్టిన గుర్తింపు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. కేజీఎఫ్ సినిమాలో నటించకుండా ఉండి ఉంటే శ్రీనిధి శెట్టి టాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లో చాలా సినిమాలు చేసి ఉండేది అనేది కొందరి అభిప్రాయం. తాజాగా హిట్‌ 3 సినిమా ప్రమోషన్‌లో భాగంగా శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ కేజీఎఫ్‌ సినిమాలో నటించడం వల్ల కెరీర్‌కి స్పీడ్‌ బ్రేకప్‌ పడింది అంటూ వస్తున్న వార్తలపై స్పందించింది.

తాజా ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ... కేజీఎఫ్‌ సినిమా అనేది తన పెద్ద డ్రీమ్‌ ప్రాజెక్ట్‌. ఆ సినిమాలో నటించడం అనేది చాలా పెద్ద అచీవ్‌మెంట్‌. ఆ సినిమాలో నటించినందుకు ఎప్పుడూ బాధపడలేదు. ఆ సినిమాలో నటించకుండా ఉంటే బాగుండేది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. కేజీఎఫ్‌ వంటి ప్రాజెక్ట్‌లో భాగం అయినందుకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటాను. ఆ సినిమా గొప్ప విజయం సాధించిన నేపథ్యంలో తన కెరీర్‌లో ఎప్పటికీ మరచిపోలేను. హీరోయిన్‌గా ఆ సినిమాలో కనిపించింది ఎంత సమయం అనేది లెక్కలు వేసుకోలేదు. ముందు నుంచే ఆ సినిమాలో నా పాత్ర గురించి తెలుసు. కనుక సినిమా విడుదల తర్వాత నేను ఎక్కువగా ఆలోచించలేదు అంది.

కేజీఎఫ్‌ ప్రాంచైజీలో వచ్చిన రెండు పార్ట్‌ల్లోనూ శ్రీనిధి శెట్టి కనిపించింది కొన్ని నిమిషాలు మాత్రమే. ఆ కారణం వల్లే శ్రీనిధి కి పెద్దగా గుర్తింపు రాలేదు అనేది కన్నడ మీడియా సర్కిల్స్ లో ఉన్న చర్చ. కానీ శ్రీనిధి మాత్రం ఇతర కారణాల వల్ల సినిమాలకు నో చెబుతూ వచ్చిందట. తాను ఎప్పుడూ ఖాళీగా లేను అని, తనకు వచ్చిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ వస్తున్నట్లు చెప్పుకొచ్చింది. కొన్ని కారణాల వల్ల విశ్రాంతి తీసుకున్నాను అని కూడా ఆమె చెప్పింది. మొత్తానికి కేజీఎఫ్ వల్ల తన కెరీర్‌కి లాభం చేకూరిందే కానీ, నష్టం అయితే జరగలేదు అని శ్రీనిధి శెట్టి చెప్పుకొచ్చింది. హిట్ 3 హిట్ అయితే కచ్చితంగా టాలీవుడ్‌లో ఈ అమ్మడు బిజీ కావడం ఖాయం. టాలీవుడ్‌లో హిట్‌ 3 తో ఎంట్రీ ఇవ్వబోతున్న శ్రీనిధికి ఇప్పటికే మంచి మార్కులు దక్కాయి. కనుక ముందు ముందు ఈ అమ్మడికి మరిన్ని పెద్ద సినిమాల్లో ఆఫర్లు వస్తాయేమో చూడాలి.