కథ విన్నప్పుడే ఆ విషయం ఫిక్సయ్యా
అయితే హిట్3 సినిమా మొదటి సీన్ నుంచి వయొలెన్స్ గా ఉండదని, అవసరమైన చోట మాత్రమే ఇందులో యాక్షన్ ఉంటుందని, కెజిఎఫ్ సినిమాలకు హిట్3 సినిమాకు చాలా తేడా ఉందని చెప్పింది.
By: Tupaki Desk | 27 April 2025 4:00 PM ISTకెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ శ్రీనిధి శెట్టి. కెజిఎఫ్1, కెజిఎఫ్2 సినిమాలతో మంచి ఫాలోయింగ్ సంపాదించిన శ్రీనిధి ఇప్పుడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. నేచురల్ స్టార్ నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్: ది థర్డ్ కేస్ సినిమాలో శ్రీనిధి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శ్రీనిధి మీడియాతో మాట్లాడి పలు విషయాలను షేర్ చేసుకుంది.
కెజిఎఫ్, కెజిఎఫ్2, ఇప్పుడు హిట్3 మూడూ సినిమాలూ హింసతో కూడుకున్నవేనని, కానీ తాను మాత్రం చాలా సాఫ్ట్ అని, వయొలెన్స్ ను తాను వద్దనుకున్నా, వయొలెన్స్ తనను వద్దనుకోవడం లేదని, అయితే హిట్3 సినిమా మొదటి సీన్ నుంచి వయొలెన్స్ గా ఉండదని, అవసరమైన చోట మాత్రమే ఇందులో యాక్షన్ ఉంటుందని, కెజిఎఫ్ సినిమాలకు హిట్3 సినిమాకు చాలా తేడా ఉందని చెప్పింది.
ఈ సినిమా కథ విన్నప్పుడే యాక్షన్ సినిమా అని అర్థమైందని, అప్పుడే ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ వస్తుందని అర్థమైందని, ఈ విషయంలో నానితో ఏ సర్టిఫికేట్ మూవీ చేయడానికి నీకు 16 ఏళ్లు పట్టింది కానీ నేను నాలుగో సినిమాతోనే ఈ ఫీట్ ను సాధించానని చెప్తుంటానని శ్రీనిధి తెలిపింది. అయితే అందరూ అనుకున్నట్టు ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని శ్రీనిధి ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చింది.
హిట్3 లో క్రైమ్, ఇన్వెస్టిగేషన్, డ్రామా, యాక్షన్, లవ్, అన్నీ ఉంటాయని, కాకపోతే యాక్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుందని, వయొలెంట్ గా ఉండే అర్జున్ సర్కార్ ను కూల్ చేసే భార్య, ప్రేయసి మృదుల క్యారెక్టర్ లో తాను కనిపిస్తానని, సినిమాలో అర్జున్, మృదుల మాట తప్పించి ఇంకెవరి మాటా వినడని, అందుకే కథలో అవసరమైన ప్రతీ చోటా తన పాత్ర కనిపిస్తుందని, దాంతో పాటూ తన క్యారెక్టర్ కు మరో ఇంట్రెస్టింగ్ యాంగిల్ కూడా ఉందని, అదేంటనేది స్క్రీన్ పైనే చూడాలని శ్రీనిధి తెలిపింది.
తెలుగులో పరిచయం అవుతున్న మొదటి సినిమాకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనే ఆశతో ఈ సినిమాకు తానే డబ్బింగ్ చెప్పానని, కన్నడ అమ్మాయిలా కాకుండా తెలుగమ్మాయిలా ఈ సినిమాకు డబ్బింగ్ చెప్పానని, ఈ విషయంలో డైరెక్టర్ శైలేష్ తనకెంతో సాయం చేశాడని చెప్పింది. ఇదే ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీత పాత్ర గురించి కూడా శ్రీనిధి క్లారిటీ ఇచ్చింది.
రామాయణం సినిమాకు తాను కేవలం ఆడిషన్ మాత్రమే ఇచ్చానని, కానీ మళ్లీ చిత్ర యూనిట్ నుంచి తనకెలాంటి ఫోన్ రాలేదని, సీత పాత్ర తనకు వస్తే తాను వదులుకున్నానని వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని, అసలు అలాంటి పాత్రలు వస్తే ఎవరైనా ఎందుకు వదులుకుంటారని ప్రశ్నించింది. ప్రస్తుతం తెలుగులో సిద్దూ జొన్నలగడ్డ సరసన తెలుసు కదా సినిమా చేస్తున్న శ్రీనిధి, కెజిఎఫ్3లో తాను ఉంటుందో ఉండదోననే ప్రశ్నను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ను అడగాలని చెప్పింది.
