టాలీవుడ్ అమ్మడికి నచ్చినట్టు ఉందే..!
కె.జి.ఎఫ్ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ సినిమా రెండు భాగాలతో అలరించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి రెండో సినిమాకు కాస్త టైం తీసుకుంది.
By: Tupaki Desk | 25 May 2025 9:30 AM ISTకె.జి.ఎఫ్ సినిమాతో తెరంగేట్రం చేసి ఆ సినిమా రెండు భాగాలతో అలరించిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి రెండో సినిమాకు కాస్త టైం తీసుకుంది. చియాన్ విక్రమ్ తో కోబ్రా చేసిన అమ్మడు ఆ సినిమా ఫెయిల్యూర్ తో షాక్ తిన్నది. కె.జి.ఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ కొట్టాక ఏ హీరోయిన్ అయినా వరుస ఛాన్స్ లు అందుకుంటుంది కానీ శ్రీనిధి మాత్రం దానికి రివర్స్ లో ఏరి కోరి సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా అమ్మడు తెలుగులో హిట్ 3 తో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. నాని తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న అమ్మడు టాలీవుడ్ కి సూపర్ హిట్ తో ఎంట్రీ ఇచ్చింది.
అసలైతే శ్రీనిధి తెలుగులో మొదట సైన్ చేసిన సినిమా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా వస్తున్న తెలుసు కదా. నీరజ కోనా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సైన్ చేసిన శ్రీనిధి ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే హిట్ 3 కి ఓకే చెప్పడం ఆ సినిమా షూటింగ్ పూర్తై రిలీజ్ అవ్వడం జరిగింది. ఏది ఏమైనా తెలుగు ఎంట్రీ శ్రీనిధికి కలిసి వచ్చింది. అంతేకాదు ఇక్కడ వాతావరణం అమ్మడికి బాగా నచ్చేసినట్టు ఉంది. తెలుసు కదా ఆల్రెడీ రిలీజ్ కు రెడీ అవుతుంది.
చూస్తుంటే శ్రీనిధి కూడా ఇక మీదట వరుసగా తెలుగు సినిమాలే చేయాలని చూస్తున్నట్టు ఉంది. ఎలాగు పాన్ ఇండియా ఇమేజ్ ఉంది కాబట్టి శ్రీనిధిని మరో పాన్ ఇండియా సినిమాలో సెలెక్ట్ చేస్తే మాత్రం ఇక అమ్మడి కెరీర్ కి తిరుగు ఉండదని చెప్పొచ్చు. సిద్ధుతో చేస్తున్న తెలుసు కదా సినిమాకు కూడా శ్రీనిధి లక్ కలిసి వచ్చేలా ఉంది. హిట్ 3 సినిమా చేయడమే కాదు నానితో కలిసి ప్రతి ప్రమోషనల్ యాక్టివిటీలో శ్రీనిధి పాల్గొన్న తీరు ఆమె మీద తెలుగు ఆడియన్స్ ప్రేమ చూపించేలా చేసింది.
మరి శ్రీనిధి తెలుగులో కెరీర్ ఎలా కొనసాగిస్తుంది. తెలుసు కదా తర్వాత ఆమె ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది అన్నది చూడాలి. హిట్ 3 సక్సెస్ తో శ్రీనిధి శెట్టి పేరు టాలీవుడ్ లో హెడ్ లైన్స్ లో ఉంది. సో తప్పకుండా ఆమెకు ఇక్కడ మంచి కెరీర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. టాలీవుడ్ లోనే కాదు అమ్మడు కన్నడలో కూడా ఒకటి రెండు సినిమాలు సైన్ చేసినట్టు తెలుస్తుంది.
