Begin typing your search above and press return to search.

శ్రీమంతుడు కాపీ రైట్‌ వివాదం.. మైత్రీ స్పందన ఇదే

తాజాగా శ్రీమంతుడు సినిమా వివాదంపై ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. "చచ్చేంత ప్రేమ నవలకు శ్రీమంతుడు సినిమాకు పోలికలు ఉన్నాయన్న వాదనల గురించి మేం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం.

By:  Tupaki Desk   |   2 Feb 2024 3:34 AM GMT
శ్రీమంతుడు కాపీ రైట్‌ వివాదం.. మైత్రీ స్పందన ఇదే
X

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా కాపీ రైట్‌ వివాదం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. శ్రీమంతుడు సినిమా తాను రాసిన నవలకు కాపీ అని శరత్ చంద్ర అనే రచయిత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై సుప్రీంకోర్టును కొరటాల శివ ఆశ్రయించగా.. ఆయనకు చుక్కదురైంది. ఈ నేపథ్యంలో రచయిత శరత్ చంద్రను పలు మీడియా సంస్థలు ఇంటర్వ్యూ చేస్తుండగా.. ఆయన కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.

తాజాగా శ్రీమంతుడు సినిమా వివాదంపై ఆ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ స్పందించింది. "చచ్చేంత ప్రేమ నవలకు శ్రీమంతుడు సినిమాకు పోలికలు ఉన్నాయన్న వాదనల గురించి మేం ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం. ప్రజల ముందుకొచ్చిన ఈ రెండు కూడా కొంత భిన్నమైన కథాంశాలే అని పుస్తకాన్ని చదివినవారికి, అలాగే సినిమాను పరిశీలించిన వారికి అర్థమవుతుంది. అయితే ఈ వివాదం ప్రస్తుతం చట్టపరమైన సమీక్షలో ఉంది.

ఇప్పటి వరకు దీనిపై ఎటువంటి తీర్పు వెలువడలేదు. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ధారణలకు రావొద్దంటూ మేం మీడియా వాళ్లను కోరుతున్నాం. గ్రామాన్ని దత్తత తీసుకోవాలనే మా ప్రధాన ఆలోచనతో పాటు శ్రీమంతుడు సినిమాపై మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రెండు అంశాలను వ్యక్తిగతంగా పరిశీలించాలనుకునే వారిని మేం ప్రోత్సహిస్తాం. న్యాయ ప్రక్రియపై నమ్మకాన్ని ఉంచి సహకరించాలని మేం కోరుతున్నాం. మీ మద్దతుకు మా ధన్యవాదాలు" అంటూ ప్రకటన విడుదల చేసింది.

అసలేం జరిగిందంటే?

మహేశ్‌ బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా శ్రీమంతుడు. 2015లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఆ సమయంలోనే శ్రీమంతుడు మూవీని తన నవల ఆధారంగా తెరకెక్కించారంటూ రచయిత శరత్‌ చంద్ర హైదరాబాద్‌ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. కొరటాల శివపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కొరటాలకు చుక్కెదురైంది. దీంతో సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడా అక్కడా అదే పరిస్థితి ఎదురైంది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్‌ కేసు ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం ఆ సమయంలో స్పష్టం చేసింది. మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడాలి.