Begin typing your search above and press return to search.

శ్రీకాంత్‌, శివాని.. ఇన్నాళ్ల తర్వాత కొట్టారు

ఇక ఈ సినిమాతో చాలా కాలంగా హిట్‌ కోసం ఎదురు చూస్తున్న శ్రీకాంత్ మరియు శివానిలకు ఆ హిట్ దక్కింది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 6:38 AM GMT
శ్రీకాంత్‌, శివాని.. ఇన్నాళ్ల తర్వాత కొట్టారు
X

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ నాయట్టు ను గీతా ఆర్ట్స్ వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు కోట బొమ్మాళి పీఎస్ గా రీమేక్ చేసి తీసుకు వచ్చాయి. ఈ సినిమాలోని లింగి లింగి లింగిడి పాట సూపర్‌ హిట్ అవ్వడంతో సినిమాపై కూడా అంచనాలు పెరిగాయి. విడుదల సమయంలో వైవిధ్యభరిత ప్రచారంతో మరింతగా అంచనాలు పెంచారు మేకర్స్.

సినిమాకు పాజిటివ్ టాక్‌ వచ్చి, పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ దక్కించుకోవడం తో సాధ్యం అయినంత వరకు రికవరీ అయిందని టాక్‌.

ఇక ఈ సినిమాతో చాలా కాలంగా హిట్‌ కోసం ఎదురు చూస్తున్న శ్రీకాంత్ మరియు శివానిలకు ఆ హిట్ దక్కింది. ఫ్యామిలీ హీరోగా ఎన్నో మంచి విజయాలను సొంతం చేసుకున్న శ్రీకాంత్ కి గత దశబ్ద కాలంగా సరైన సక్సెస్ లేదు. విలన్ గా చేసినా కూడా పెద్దగా శ్రీకాంత్ ను పట్టించుకోలేదు. ఎట్టకేలకు కోటబొమ్మాళి పీఎస్ లో మంచి నటన కనబర్చడం వల్ల మంచి మార్కులు దక్కించుకున్నాడు.

ఇక రాజశేఖర్‌ - జీవిత నట వారసురాలిగా చాలా కాలం క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ శివాని. ఈమె చెల్లి శివాత్మిక కి అయినా కొద్దిగొప్ప సక్సెస్ లు దక్కాయి. కానీ శివానికి మాత్రం అసలు గుర్తింపు దక్కలేదు. ఎట్టకేలకు ఈ సినిమా తో ఆ గుర్తింపు మరియు కమర్షియల్‌ విజయం దక్కినట్లు అయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

శివాని డీ గ్లామర్‌ రోల్‌ లో కనిపించినా కూడా ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. ఆమె ముందు ముందు గ్లామర్ పాత్రలు చేస్తూ చూడాలి అనుకుంటున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తప్పకుండా అన్ని వర్గాల వారిని ముందు ముందు వీరిద్దరూ మరిన్ని సినిమాలు, పాత్రలతో ఈ విజయంతో అలరించే అవకాశాలు ఉన్నాయి.