Begin typing your search above and press return to search.

నాని దసరా 2 మళ్లీ అదే టార్గెట్..?

అంతేకాదు దసరా సినిమాతో తనని తక్కువ అంచనా వేసిన్స్ అందరికీ రీ సౌండ్ వినిపించేలా చేసిన నాని అదే ఫాం కొనసాగిస్తున్నాడు.

By:  Tupaki Desk   |   19 April 2024 4:49 AM GMT
నాని దసరా 2 మళ్లీ అదే టార్గెట్..?
X

టాలీవుడ్ లో సక్సెస్ రేషియో ఎక్కువగా ఉన్న హీరోల లిస్ట్ లో నాని కూడా ఉంటాడు. స్టార్ హీరోలు పాన్ ఇండియా మోజులో భారీ బడ్జెట్ తో సినిమాలు చేసి హిట్లు ఫ్లాపులతో లెక్కలు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటే నాని మాత్రం తన రేంజ్ బడ్జెట్ తో సక్సెస్ మేనియా కొనసాగిస్తున్నాడు. నాని సినిమా అంటే చాలు మినిమం గ్యారెంటీ అనే సెంటిమెంట్ ఏర్పడింది. అంతేకాదు దసరా సినిమాతో తనని తక్కువ అంచనా వేసిన్స్ అందరికీ రీ సౌండ్ వినిపించేలా చేసిన నాని అదే ఫాం కొనసాగిస్తున్నాడు.

దసరా తర్వాత నాని తన మార్క్ మూవీ హాయ్ నాన్నతో కూడా మంచి ఫలితాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం నాని వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు నాని. ఆగష్టు ఎండింగ్ లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా తర్వాత నాని సుజిత్ డైరెక్షన్ లో సినిమా లాక్ చేశాడు. సుజిత్ పవర్ స్టార్ పవన్ తో చేస్తున్న OG పూర్తి చేశాక నాని సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

మరోపక్క నాని మరోసారి దసరా కాంబో రిపీట్ చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెలతో నాని సెకండ్ అటెంప్ట్ మరింత భారీగా ఉండేలా చూస్తున్నాడు. ఈ క్రమంలో రీసెంట్ గా దసరా కాంబో కలిసి చేస్తున్న సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ వచ్చింది. ఈసారి కూడా నాని మాస్ అవతార్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేయనున్నాడు. ఈసారి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో శ్రీకాంత్ ఓదెల నాని సినిమా ఉంటుందని తెలుస్తుంది.

సుజిత్ సినిమా లేట్ అయితే శ్రీకాంత్ ఓదెలతోనే సినిమా మొదలు పెట్టాలని చూస్తున్నాడు నాని. ఈ సినిమా ను సెప్టెంబర్ లో అలా మొదలు పెట్టి మళ్లీ దసరా రిలీజ్ టైం లోనే అదే మార్చ్ ఎండింగ్ లోనే సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమా కోసం భారీ సెట్స్ ఇప్పటి నుంచే ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. దసరా 2 దసరా కాదు అంతకుమించి ఉండేలా చూస్తున్నారు. సో నాని మరోసారి తన నట విశ్వరూపంతో ఫ్యాన్స్ కు కిక్ ఇస్తాడని చెప్పొచ్చు. శ్రీకాంత్ ఓదెల సినిమాను మార్చ్ లో రిలీజ్ చేసే ప్లానింగ్ తో భాగంగా సుజిత్ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో మొదలైనా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ రిలీజ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.