Begin typing your search above and press return to search.

బ్యాలెన్స్ జీరో..అకౌంట్ లో 70 పైస‌లు!|

ఆ మ‌ధ్య ఒంట‌రి జీవితం గురించి మాట్లాడిన ఆయ‌న తాజాగా మ‌రోసారి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. సాధార‌ణంగా సినిమా న‌టుడి ఆదాయం అంటే భారీగానే ఉంటుంద‌ని అంతా భావిస్తారు.

By:  Tupaki Desk   |   31 Oct 2023 2:45 AM GMT
బ్యాలెన్స్ జీరో..అకౌంట్ లో 70 పైస‌లు!|
X

క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ శ్రీకాంత్ అయ్యంగార్ సుప‌రిచితుడే. వైవిథ్య‌మైన న‌ట‌న‌తో త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్న న‌టుడాయ‌న‌. ముఖ్యంగా వ‌ర్మ సినిమాల‌తో బాగా ఫేమ‌స్ అయిన న‌టుడు. వ‌ర్మ ఫిలాస‌ఫీని అనుస‌రించ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. శ్రీకాంత్ జీవితం కూడా వ‌ర్మ జీవితానికి చాలా ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. వ‌ర్మ‌ని ఆరాధించే న‌టుడు కూడా. జీవితం ఆయ‌న‌లా ఉండాల‌ని... ఎలాంటి బాధ బంధీ లేకుండా ఉండ‌టం అంటేనే ఇష్టం అంటారు.

త‌న‌పై వ‌ర్మ ప్ర‌భావం చాలా బ‌లంగా ఉంటుంద‌ని..వ‌ర్మ త‌న జీవితంలో ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా ఎప్ప‌టి క‌ప్పుడు చెబుతుంటారు. ఈ మ‌ద్య కాలంలో వ‌ర్మ సినిమాలే కాకుండా ఇత‌ర హీరోల చిత్రాల్లో కూడా బాగానే అవ‌కాశాలు అందుకుంటున్నారు. త‌న‌దైన శైలి పెర్పార్మెన్స్ తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్నారు. పాజిటివ్ రోల్స్ లో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. అలాగే యూ ట్యూబ్ లో ఇంట‌ర్వ్యూలు కూడా దండీగానే ఇస్తున్నారు త‌న జీవిన విధానం ఎలా ఉంటుంది? వ్య‌క్తిగ‌త జీవితం ఎలా సాగుతుంది వంటి ఆస‌క్తిక‌ర విష‌యాలు ఎంతో ఓపెన్ గా షేర్ చేసుకుంటున్నారు.

ఆ మ‌ధ్య ఒంట‌రి జీవితం గురించి మాట్లాడిన ఆయ‌న తాజాగా మ‌రోసారి ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. సాధార‌ణంగా సినిమా న‌టుడి ఆదాయం అంటే భారీగానే ఉంటుంద‌ని అంతా భావిస్తారు. ఒక సినిమా చేస్తేనే ల‌క్ష‌ల్లో సంపాద‌న క‌నిపిస్తుంది. శ్రీకాంత్ లాంటి న‌టుడి ఆదాయం అయితే బాగానే ఉంటుంది. 65 ఎక‌రాల్లో సొంతంగా ఓ ఫామ్ హౌస్ కూడా ఉంది. అయితే ఈ న‌టుడి అకౌంట్ లో ఇప్పుడు ఎంత ఉంది? అంటే 70 పైస‌లు.

అవును నేరుగా ఆయ‌నే త‌న అకౌంట్ ఓపెన్ చేసి ఇంత ఉంద‌ని చూపించాడు. పేరున్న న‌టుడు..ల‌క్ష‌లు కోట్లు ఉంటాయి? మీ అకౌంట్లో 70 పైస‌లు ఏంటి? అంటే డ‌బ్బు గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోను అన్నారు. త‌న ఆర్దిక లావాదేవీల‌న్నీ త‌న త‌మ్ముడు చూసుకుంటారుట‌. చివ‌ర‌కి క‌రెంట్ బిల్లు క‌ట్టాల‌న్నా కూడా ఆ ప‌ని కూడా త‌మ్ముడే చూసుకుంటాడుట‌. ఒక‌వేళ డ‌బ్బులుంటే ఏదో ఖ‌ర్చు అవుతూనే ఉంటుంద ని...అకౌంట్ లో డ‌బ్బులుండ‌టం అన్న‌ది చాలా రేర్ అని అంటున్నారు.