Begin typing your search above and press return to search.

నేనేం సైకో శాడిస్ట్ కాదంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్..!

తాను సైకో, రేపిస్ట్ కాదని.. శాడిస్ట్ ని కూడా కాదు కాని వాళ్లే తప్పు చేసి తన జీవితం నుంచి వెళ్లిపోవడం తనని బాధ పెట్టిందని అన్నారు శ్రీకాంత్ అయ్యంగార్.

By:  Tupaki Desk   |   5 Jan 2024 1:30 AM GMT
నేనేం సైకో శాడిస్ట్ కాదంటున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్..!
X

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో ఒకరు శ్రీకాంత్ అయ్యంగార్. 2005 లో ఒక సినిమాలో నటించిన ఆయన 2013లో చమ్మక్ చల్లో సినిమాలో నటించారు. ఇక 2016 లో ఆర్జీవి తెరకెక్కించిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమాలో తనకు ఇచ్చిన పాత్రలో తన నటనతో మెప్పించారు. అందుకే ఆ సినిమా నుంచి అతనికి అవకాశాలు వచ్చాయి. 2020 నుంచి అయితే అతను ఏడాదికి పదుల సంఖ్యలో సినిమాలు చేస్తూ వస్తున్నారు.

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన ఫాం కొనసాగిస్తున్న శ్రీకాంత్ అయ్యంగార్ ప్రొఫెషనల్ గా అందరికీ తెలుసు కానీ ఆయన పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకుంటే అందరు షాక్ అవుతారు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన జీవితంలో జరిగిన కష్టాల గురించి చెబుతూ బాధపడ్డారు. తానొక తిక్క మనిషినే అబద్ధాలు చెప్పడం, నిజాయితీగా లేకపోవడం లాంటివి చేయనని అన్నారు. తను చేసిన తప్పుల వల్లే తన జీవితం నుంచి భార్య పిల్లలు వెళ్లిపోయారని అన్నారు.

ఫ్యామిలీ మ్యాన్ గా బతకాలని అందరికీ ఉంటుది కానీ ఆ టైం లో తనకు చాలా కష్టంగా అనిపించింది. అందుకే వాళ్లని దూరం చేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. తాను సైకో, రేపిస్ట్ కాదని.. శాడిస్ట్ ని కూడా కాదు కాని వాళ్లే తప్పు చేసి తన జీవితం నుంచి వెళ్లిపోవడం తనని బాధ పెట్టిందని అన్నారు శ్రీకాంత్ అయ్యంగార్.

భార్య మాత్రమే కాదు ఇద్దరు కూతుళ్లు కూడా తనను అర్థం చేసుకోకుండా తల్లి మాట విని వెళ్లిపోయారని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకోవడం.. ఆమె కూడా వేరే వాళ్ల తో వెళ్లడం వల్ల అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నట్టు చెప్పుకొచ్చారు శ్రీకాంత్ అయ్యంగార్. ప్రస్తుతం తన భార్యా పిల్లలు ఎక్కడ ఉన్నారో అని తనకు అవసరం లేదని తనని వదిలేసి వెళ్లిన వారి గురించి తనకెందుకని అన్నారు.

అడవిలో తన తమ్ముడితో కలిసి హాయిగా జీవిస్తున్నాను.. చేయాలనుకున్న పనులను చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నానని అన్నారు. తనకు ఎలాంటి రీగ్రేట్స్ లేవని.. సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే బాధలేమి గుర్తుకు రావట్లేదని అన్నారు శ్రీకాంత్ అయ్యంగార్.