Begin typing your search above and press return to search.

అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేసిన శ్రీకాంత్ కుమార్తె

పింక్ డిజైన్ చీర మేధ మెరిసారు. త‌ల్లి తో పాటు మేధ‌ని మీడియా క‌వ‌ర్ చేసింది. ఆ స‌మ‌యంలో మేధ‌పైనే అంద‌రి క‌ళ్లు ప్ర‌స‌రించాయి.

By:  Tupaki Desk   |   4 Jan 2024 3:39 PM GMT
అభిమానుల్ని స‌ర్ ప్రైజ్ చేసిన శ్రీకాంత్ కుమార్తె
X

ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ వార‌స‌త్వాన్ని కొన‌సాగించ‌డానికి పెద్ద కుమారుడు రోష‌న్ ఇప్ప‌టికే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్ హీరో పాత్ర‌ల నుంచి విల‌న్ గా..క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ పాత్ర‌ల‌కు ట‌ర్న్ తీసుకోవ‌డం....తన‌యుడు రావ‌డం ఒకేసారి జ‌రిగాయి. ప్ర‌స్తుతం న‌టుడిగా శ్రీకాంత్ కెరీర్ కి ఎలాంటి ఢోకా లేదు. స్టార్ హీరోల చిత్రాల్లో కీల‌క పాత్ర‌లు పోషిస్తు ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తున్నాడు.

ఇక రోష‌న్ అందివ‌చ్చిన అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నాడు. హీరో క‌టౌట్ అయినా అవ‌కాశాల ప‌రంగా కాస్త వెనుకంజ‌లో ఉన్నాడు. స‌రైన హిట్ ప‌డితే రోష‌న్ కి కెరీర్ తిరుగుండ‌దు. అలాగే చిన్న కుమారు డు రోహాన్ ఉన్నాడు. రోహ‌న్ ఇంకా ఎక్క‌డా బ‌య‌ట క‌నిపించ‌లేదు. మ‌రి అత‌న్ని లాంచ్ చేస్తాడా? లేదా? అన్న‌ది చూడాలి. అలాగే శ్రీకాంత్-ఊహ దంప‌తుల‌కు ఓ కుమార్తె కూడా ఉన్నారు.

కానీ ఆమె ఇప్ప‌టివ‌ర‌కూ ఎక్క‌డా బ‌య‌ట క‌నిపించ‌లేదు. అందులోనూ సినిమా ఈవెంట్ల‌లో ఎక్క‌డా క‌నిపించ‌రు. తాజాగా హీరో శ్రీకాంత్ కుటుంబ సమేతంగా తిరుముల వెంకటేశ్వరస్వామిని దర్శించుకు న్నారు. తల్లిదండ్రుల‌తో పాటు కుమార్తె మేధ కూడా వ‌చ్చారు. ఇక మేధ‌ని చీరందంలో చూసే స‌రికి ఒక్క‌సారిగా అంతా స్ట‌న్ అయిపోవ‌డం ఖాయం. పింక్ డిజైన్ చీర మేధ మెరిసారు. త‌ల్లి తో పాటు మేధ‌ని మీడియా క‌వ‌ర్ చేసింది. ఆ స‌మ‌యంలో మేధ‌పైనే అంద‌రి క‌ళ్లు ప్ర‌స‌రించాయి.

నుదిటిన శ్రీవారి నామాలు పెట్టుకున్నారు. నెక్ పై సింపుల్ గా చిన్న పూస‌ల‌తో కూడిన చైన్ ధ‌రించారు. మేధ వేసుకున్న చెవిలీలు మ‌రింత అందంగా తీర్చి దిద్దాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి. శ్రీకాంత్ కి ఇంత పెద్ద కుమార్తె ఉందా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మ‌రి మేధ‌ని సినిమా ల్లోకి తీసుకొస్తారా? చ‌దువులు వ్యాపారం..పెళ్లి అంటూ అటువైపుగా ప్లాన్ చేస్తున్నారా? అన్న‌ది తెలియాలి.

ప్ర‌స్తుతం టాలీవుడ్ ఫ్యామిలీల నుంచి కూడా కుమార్తెలు ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. నాగ‌బాబు కుమార్తె నిహారిక సినిమా రంగంలో రాణిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అలాగే మంచు మోహ‌న్ బాబు కుమార్తె ల‌క్ష్మి కూడా అవ‌స‌రం మేర మ్యాక‌ప్ వేసుకుంటున్నారు.