Begin typing your search above and press return to search.

శ్రీకాంత్ అడ్డాల నమ్మకం నిలబడుతుందా..!

తను మాస్ సినిమాలు కూడా తీయగలనని ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ అడ్డాల పెదకాపు తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 9:04 AM GMT
శ్రీకాంత్ అడ్డాల నమ్మకం నిలబడుతుందా..!
X

సెన్సిబుల్ డైరెక్టర్ గా అంతకుముందు తన సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల నారప్ప తర్వాత తన డైరెక్షన్ పంథా మార్చుకున్నాడు. తను మాస్ సినిమాలు కూడా తీయగలనని ప్రూవ్ చేసుకున్న శ్రీకాంత్ అడ్డాల పెదకాపు తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన పెదకాపు 1 సినిమా మరో నాలుగు రోజుల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా విషయంలో శ్రీకాంత్ అడ్డాల డేర్ స్టెప్ అందరిని ఆశ్చర్య పరుస్తుంది.

సామన్యుడి సంతకం అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న పెదకాపు 1 సినిమా లో చాలా మ్యాటర్ ఉందని తెలుస్తుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ సినిమాపై ఒక మార్క్ సెట్ చేయగా సినిమా చూశాక ఆ ఇంప్యాక్ట్ మరింత ఉంటుందని తెలుస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాగా పెదకాపు ప్రచార చిత్రాలతోనే ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయా శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా ఎలా తీసి ఉంటారన్న దాని మీద మరింత ఆసక్తిగా ఉన్నారు.

అంతేకాదు సినిమా నిర్మాత రవీందర్ రెడ్డి ఈ కథ గురించి చాలా గొప్పగా చెప్పారు. విరాట్ మొదటి సినిమాకే ఇలాంటి కథ దొరకడం తన అదృష్టమని అన్నారు. తన వారసుడు హీరోగా వచ్చినా సరే ఇంత మంచి కథ కుదురుతుందని చెప్పలేనని అన్నాడు.

మరి కథాబలం తో వస్తున్న ఈ పెదకాపు ప్రేక్షకులను టచ్ చేస్తుందా సినిమాపై చిత్ర యూనిట్ పెట్టుకున్న నమ్మకాన్ని ఆడియన్స్ నిజం చేస్తారా అన్నది చూడాలి. పెదకాపు 2 సినిమాలో ప్రగతి హీరోయిన్ గా నటించగా రావు రమేష్, అనసూయ కూడా ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు. ముఖ్యంగా అనసూయ పాత్ర సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెబుతున్నారు చిత్ర యూనిట్.

కొత్త హీరోతో రిస్క్ అని తెలిసినా శ్రీకాంత్ అడ్డాల చాలా కసితో ఈ సినిమా తెరకెక్కించారు. సినిమా రిలీజ్ ముందే పక్కా హిట్ అన్న కాన్ఫిడెంట్ తో ఉన్నారు మేకర్స్. ఆడియన్స్ రియాక్షన్ కూడా అదే అయితే శ్రీకాంత్ అడ్డాల తిరిగి ఫాంలోకి వచ్చినట్టే లెక్క. అంతేకాదు పెదకాపు 1 సక్సెస్ అయితే పెదకాపు 2 మీద మరింత బాధ్యత పెరిగే అవకాశం ఉంది.