Begin typing your search above and press return to search.

రిస్క్ అన్నారు.. మన కంటే మన సినిమా ఎక్కువ మాట్లాడాలి!

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం సినిమాలు చేసిన శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో నారప్ప రీమేక్ చేసి తనలోని మాస్ యాంగిల్ కూడా ఉందని చూపించాడు.

By:  Tupaki Desk   |   24 Sep 2023 5:25 AM GMT
రిస్క్ అన్నారు.. మన కంటే మన సినిమా ఎక్కువ మాట్లాడాలి!
X

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం సినిమాలు చేసిన శ్రీకాంత్ అడ్డాల వెంకటేష్ తో నారప్ప రీమేక్ చేసి తనలోని మాస్ యాంగిల్ కూడా ఉందని చూపించాడు. అది సక్సెస్ అవడంతో ఆ ప్రోత్సాహంతోనే పెదకాపు అంటూ మరో మాస్ మూవీతో వస్తున్నాడు. ద్వారా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో విరాట్ హీరోగా పరిచయమవుతున్నారు. సినిమా ఈ నెల 29న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు.

ఈవెంట్ లో డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.. చాలా దూరం నుంచి వచ్చిన అందరికీ థ్యాంక్స్.. మన కంటే మన సినిమా ఎక్కువ మాట్లాడాలని అనుకుంటా.. ఈ సినిమా జర్నీ మొత్తం నిర్మాత చెప్పారు. ఆయన చెప్పిన ప్రతి మాట నిజమని అన్నారు శ్రీకాంత్ అడ్డాల. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రవీందర్ రెడ్డికి థ్యాంక్స్. ఒక కథ చెప్పడం వేరు.. ఒక అవకాశం తెచ్చుకోవడం వేరు. మనం ఎంత గొప్పగా ఉన్నా ప్రతిసారి అవకాశం రావడం వెనుక ఒక స్ట్రగుల్ ఉంటుందని.. అది కొందరు బయటకు చెప్పొచ్చు కొందరు చెప్పుకోకపోవచ్చని అన్నారు శ్రీకాంత్ అడ్డాల.

తను అనుకున్నది జనాల్లోకి తీసుకెళ్లాలన్న ఆర్తి దానికి ఎవరో ఒకరి ఆలంబన కావాలి అలా రవీందర్ రెడ్డి నిలబడ్డారు. సినిమా హీరో విరాట్ గురించి చెబుతూ కొత్త అబ్బాయితో రిస్క్ అని అన్నారు. తన ఫ్రెండ్స్ కూడా వద్దని అన్నారు. కానీ నేను కథను నమ్మా విరాట్ కి కూడా అదే చెప్పా. ఈ సినిమాకు సామాన్యుడి సంతకం అని పెట్టింది కూడా కొత్త అతను చేస్తేనే బాగుందని అన్నారు శ్రీకాంత్ అడ్డాల. కొత్త అబ్బాయితో పెద్ద స్టార్ కాస్ట్ తో డైరెక్టర్ గా వీరందరితో చేయించుకోవడం అందరి తరపున నిలబడి చేసుకోగలిగాడు అనే పేరు వదులుకోకూడదని ఈ సినిమా చేశానని అన్నారు శ్రీకాంత్ అడ్డాల.

ఈ జర్నీ చాలా బాగుంది. ఈ సినిమా సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. లైఫ్ ఆఫ్ ఏ పెదకాపు మీ అందరినీ అలరిస్తుందని మాట్లాడాల్సింది చాలా ఉందని అది సినిమా సక్సెస్ అయ్యాక మాట్లాడతా అన్నారు శ్రీకాంత్ అడ్డాల.

ఈవెంట్ లో పెదకాపు హీరో విరాట్ కూడా ఆసక్తికరంగా మాట్లాడాడు. ఇంత పెద్ద సినిమాను నాతో తీసిన నా బావకి రుణపడి ఉంటా. ఓ నటుడిగా తొలి సినిమాకు ఉండాల్సిన జ్ఞాపకాలన్నీ ఈ సినిమాతో ఉన్నాయని అన్నారు. సినిమాకు తనను నమ్మి ఇంత పెద్ద సినిమాలో తనని తీసుకున్నందుకు థ్యాంక్స్. సినిమాలో చాలామంది నటించారు. నేనొక కొత్త వాడిని అని చూడకుండా బాగా సపోర్ట్ చేశారు. హీరోయిన్ ప్రగతి కూడా బాగా సపోర్ట్ చేశారు. సినిమాకు అంతా వారి బెస్ట్ ఇచ్చారు. కష్టపడి ఇష్టపడి ఈ సినిమా చేశాం ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుందని మీరు ఇస్తారని కోరుతున్నానని అన్నారు విరాట్.