Begin typing your search above and press return to search.

సుకుమార్ కు ఇచ్చిన మాట కోసమే..!

సుకుమార్ దగ్గర పంచేసే సహ దర్శకులు ఎక్కువమంది డైరెక్టర్ గా సక్సెస్ అవుతున్నారని తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Sep 2023 10:30 AM GMT
సుకుమార్ కు ఇచ్చిన మాట కోసమే..!
X

స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి మంచి వర్క్ నేర్పిస్తుంటాడు. తానేమి స్పెషల్ గా తన సహ దర్శకులకు ట్యూషన్లు చెప్పనని వర్క్ విషయంలో ఎంత్ ఫోకస్ గా ఉండాలన్నది చర్చిస్తామని అప్పట్లో ఒకసారి అన్నారు. అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఆయన దగ్గర అసోసియేట్ గా చేయడం వల్ల తనకు దర్శకత్వం మీద ఇంకాస్త ఎక్కువ ఆసక్తి పెరిగిందని అన్నారు డిరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. ప్రస్తుతం పెదకాపు 1 సినిమాతో ఆయన త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

సుకుమార్ దగ్గర ఆర్య సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసే టైం లోనే ఆయన తన దగ్గర పనిచేసే దర్శకులకు ఒక మాట చెప్పారని మీరంతా కూడా డైరెక్టర్స్ అవ్వాలని అప్పుడు అందరు కలిసి మళ్లీ ఒక గ్రూప్ ఫోటో దిగాలని అన్నారు.

ఆయనకు ఇచ్చిన మాట కోసం అంతా డైరెక్షన్ చేస్తున్నామని అన్నారు శ్రీకాంత్ అడ్డాల. సుకుమార్ దగ్గర పంచేసే సహ దర్శకులు ఎక్కువమంది డైరెక్టర్ గా సక్సెస్ అవుతున్నారని తెలిసిందే. ఆ విషయంలో సుకుమార్ కి క్రెడిట్ దక్కుతుందని ఆయన తన దగ్గర పనిచేస్తున్న ప్ర్తి వ్యక్తికి పని తెలియాలని కోరుకుంటాడని అన్నారు శ్రీకాంత్ అడ్డాల.

వర్క్ మీద ఆయనకు ఉన్న డెడికేషన్ అలాంటిది కాబట్టే ఆయన సక్సెస్ అవుతూ అతని దగ్గర పనిచేసిన దర్శకులు కూడా సక్సెస్ అవుతున్నారని అన్నారు. ఇక పెదకాపు 1 సినిమా తన కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమా అని.. తన మొదటి సినిమా కోసం ఎలా కసిగా పనిచేశానో ఈ సినిమాకు కూడా అంతే పనిచేశామని అన్నారు శ్రీకాంత్ అడ్డాల.

కొత్త హీరోతో ఇలాంటి కథ కాస్త రిస్క్ అని తెలిసినా కావాలనే ప్రయోగం చేశామని. ఇప్పుడు స్టార్ గా ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట ప్రయాణం మొదలు పెట్టిన వారే అని చెప్పుకొచ్చారు శ్రీకాంత్ అడ్డాల.

నిర్మాత బంధువని విరాట్ ని హీరోగా తీసుకోలేదు. సినిమా కు అతను సూట్ అవుతాడనే అతన్ని తీసుకున్నామని అన్నారు. సినిమాలో ప్రతి అంశం ప్రేక్షకులను అలరిస్తుంది. తన డైరెక్షన్ లో వచ్చిన అన్ని సినిమాలకు ఇది భిన్నంగా ఉంటుందని అంటున్నారు శ్రీకాంత్ అడ్డాల. చిత్ర యూనిట్ అంతా పెదకాపు సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్నారు.