Begin typing your search above and press return to search.

అతిలోక సుందరి ఇల్లు అద్దెకి ఇవ్వబడును..!

అతిలోక సుందరి శ్రీదేవి మృతి చెంది ఐదేళ్లు దాటినా కూడా ఇంకా ఆమె జ్ఞాపకాల్లోనే అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు.

By:  Tupaki Desk   |   2 May 2024 6:50 AM GMT
అతిలోక సుందరి ఇల్లు అద్దెకి ఇవ్వబడును..!
X

అతిలోక సుందరి శ్రీదేవి మృతి చెంది ఐదేళ్లు దాటినా కూడా ఇంకా ఆమె జ్ఞాపకాల్లోనే అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు ఉన్నారు. ఆమె నట వారసురాలు జాన్వీ కపూర్‌ బాలీవుడ్‌ లో ఇప్పటికే హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది. దేవర సినిమాతో టాలీవుడ్‌ లో అడుగు పెట్టబోతుంది. చరణ్ కి జోడీగా కూడా జాన్వీ కపూర్ నటించబోతుంది.

మరోసారి శ్రీదేవి గురించిన ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఈసారి శ్రీదేవి చెన్నై ఇంటికి సంబంధించిన విశేషాలతో శ్రీదేవి వార్తల్లో నిలిచారు. హీరోయిన్‌ గా ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించి, భారీగా పారితోషికం తీసుకున్న కూడా శ్రీదేవి చెన్నై లో సొంత ఇల్లు కొనుగోలు చేయలేదు.

బోనీ కపూర్ ను వివాహం చేసుకున్న తర్వాత కొన్నాళ్లకు చెన్నై లో శ్రీదేవి పెద్ద ఇల్లు కొనుగోలు చేశారు. శ్రీదేవి ఉన్నంత కాలం చెన్నై వచ్చిన ప్రతి సారి ఆ ఇంటికి వెళ్లి చూసుకుంటూ ఉండేవారు. కానీ ఆమె చనిపోయిన తర్వాత ఆ ఇల్లు మెయింటెన్స్ లేక పోవడంతో పనికి రాకుండా ఉంది.

ఇటీవలే బోనీ కపూర్‌ ఆ ఇంటిని శ్రీదేవి గుర్తుగా ఎప్పటికీ ఉంచుకోవాలి అనే ఉద్దేశ్యంతో బాగు చేయించాడు. ఈ మధ్య తమిళంలో బోనీ కపూర్ వరుసగా సినిమాలు నిర్మిస్తున్న నేపథ్యంలో తన ప్రొడక్షన్ హౌస్‌ కి ఆఫీస్ గా బోనీ కపూర్ వినియోగిస్తున్నాడు. మిగిలిన మొత్తం ను అద్దెకి ఇవ్వాలని నిర్ణయించారు.

తమిళనాడుకు చెందిన ఒక ప్రముఖ రెంటల్‌ ఏజెన్సీ వారు శ్రీదేవి పాత ఇంటిని అద్దెకు ఇచ్చేందుకు బోనీ కపూర్‌ పెట్టారు అంటూ పేర్కొంది. భారీ మొత్తంలో రెంట్‌ ను డిమాండ్ చేస్తున్నా కూడా శ్రీదేవి పై అభిమానంతో కచ్చితంగా ఆ ఇంటిని అద్దెకు తీసుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడే అవకాశం ఉంది.