Begin typing your search above and press return to search.

శ్రీ‌దేవి అకాల మ‌ర‌ణంపై మ‌ళ్లీ ద‌ర్యాప్తు?

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి దేశం కాని దేశంలో ఆక‌స్మికంగా మృతి చెంద‌డం ఆమె అభిమానుల‌కు డైజెస్ట్ కాని సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   6 Feb 2024 2:19 AM GMT
శ్రీ‌దేవి అకాల మ‌ర‌ణంపై మ‌ళ్లీ ద‌ర్యాప్తు?
X

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి దేశం కాని దేశంలో ఆక‌స్మికంగా మృతి చెంద‌డం ఆమె అభిమానుల‌కు డైజెస్ట్ కాని సంగ‌తి తెలిసిందే. ఈ మ‌ర‌ణంపై ఆ స‌మ‌యంలో ర‌క‌ర‌కాల సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అయితే చివ‌రికి అన్నిటినీ కాద‌ని, దుబాయ్ పోలీసులు, ద‌ర్యాప్తు సంస్థ‌లు ఇది ప్ర‌మాదం వ‌ల్ల సంభ‌వించిన‌ మ‌ర‌ణం అని తేల్చాయి. అయితే ఇదంతా బూట‌కం.. ప్ర‌భుత్వాలు దొంగాట ఆడాయంటూ ఇప్పుడు ఒక పాపుల‌ర్ యూట్యూబ‌ర్ డిటెక్టివ్ ఆరోపించ‌డం సంచ‌ల‌న‌మైంది. వివ‌రాల్లోకి వెళితే..

నాటి మేటి సూపర్‌స్టార్‌లలో ఒకరైన శ్రీదేవి 24 ఫిబ్రవరి 2018న ప్రమాదవశాత్తూ బాత్ ట‌బ్ లోని నీటిలో మునిగి చనిపోయిందని త‌న‌ భర్త బోనీ కపూర్ కనుగొన్నారు. దుబాయ్‌లో మేనల్లుడు మోహిత్ మార్వా వివాహానికి హాజరయ్యేందుకు వెళ్లిన సమయంలోఈ ఘ‌ట‌న జ‌రిగింది. బాత్ ట‌బ్ లో ప‌డిపోయాక శ్రీ‌దేవి గుండెపోటుతో మరణించిందని ద‌ర్యాప్తులో రివీల్ చేసారు. అయితే శ్రీదేవి అకాల మరణం మీడియాలో పెద్ద దుమారాన్ని సృష్టించింది. శ్రీ‌దేవి కుటుంబంతో పాటు అభిమానులు పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఎంతగా అంటే ప్రజలు ఇప్పటికీ పూర్తిగా దీనిపై అపనమ్మకంలోనే ఉన్నారు. శ్రీ‌దేవి కేవలం 54 సంవత్సరాల వయస్సులో అకస్మాత్తుగా అంత‌ర్థానం అవ్వ‌డాన్ని జీర్ణించుకోలేక‌పోయారు.

అయితే ఇప్పుడు శ్రీదేవి అకాల మరణంపై ఒక‌ యూట్యూబర్ నకిలీ పత్రాలను ఉపయోగించి భారీ వాదనలు చేశాడు. ఇటీవల భువనేశ్వర్‌కు చెందిన దీప్తి ఆర్ పిన్నిటి అనే యూట్యూబర్ శ్రీదేవి మరణంపై భారతదేశం - యుఎఇ ప్రభుత్వాలు వాస్తవాలను కప్పి ఉంచాయని పేర్కొన్నారు. సెల్ఫ్ స్టైల్ ఇన్వెస్టిగేటర్‌గా తనను తాను గుర్తించుకునే దీప్తి తన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలను పోస్ట్ చేసి నకిలీ పత్రాల ఆధారంగా అనేక ఆరోపణలు చేసినట్లు సీబీఐ త‌న ద‌ర్యాప్తులో వెల్లడించింది.

ముంబైకి చెందిన చాందినీ షా అనే న్యాయవాది ఆమెపైనా, ఆమె న్యాయవాది భరత్ సురేష్ కామత్‌పైనా ఫిర్యాదు చేశారు. ముంబైకి చెందిన న్యాయవాది... ప్రత్యక్ష ప్రసార సెషన్లలో, యూట్యూబర్ మోసపూరితంగా UAE - భారత ప్రభుత్వాలకు సంబంధించిన ప‌త్రాల‌ రికార్డులను సృష్టించారని అవి నకిలీవి అని వెల్ల‌డించారు. ఆ ఫిర్యాదు ఆధారంగా 2023 డిసెంబర్‌లో దీప్తి ఇంటిపై సీబీఐ దాడులు చేసి ఆమె ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకుందని చాందినీ షా తన ఫిర్యాదులో ఆరోపించారు.

అనుమానితురాలు దీప్తి రాణి పిన్నిటి శ్రీదేవి మరణానికి స్పాన్సర్‌గా ప్రభుత్వంపై వింతగా ఆరోపించడం ద్వారా కేంద్ర‌ ప్రభుత్వ ప్రతిష్టను దిగ‌జార్చే ప్ర‌య‌త్నం చేసింది. అయితే ఈ వివాదంలో వాస్త‌వాల‌పై మ‌రింత స‌మాచారం వెలువడాల్సి ఉంది.