Begin typing your search above and press return to search.

శ్రీదేవి కూతుళ్లు ఊరుకుంటారా పూజా హెగ్డే?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన అగ్ర కథానాయికల్లో శ్రీదేవి టాప్ ప్లేస్ లో ఉంటారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.

By:  Tupaki Desk   |   16 April 2025 6:00 PM IST
శ్రీదేవి కూతుళ్లు ఊరుకుంటారా పూజా హెగ్డే?
X

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన అగ్ర కథానాయికల్లో శ్రీదేవి టాప్ ప్లేస్ లో ఉంటారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ చేసిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో యాక్ట్ చేసి మంచి హిట్స్ అందుకున్నారు.

అయితే శ్రీదేవి మరణం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. అదే సమయంలో ఆమె బయోపిక్ వస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయంపై హీరోయిన్ పూజా హెగ్డేకు ప్రశ్న ఎదురైంది. శ్రీదేవి బయోపిక్ ఫిక్స్ అయితే.. అందులో యాక్ట్ చేస్తారా అని పూజను క్వశ్చన్ చేశారు.

ఇప్పటికే ఎల్లువచ్చి గోదారమ్మ (గద్దలకొండ గణేష్‌ సినిమాలోని పాటను ఉద్దేశించి)లో యాక్ట్ చేశానని నవ్వుతూ అన్నారు. ఎందుకంటే ఆ సాంగ్ ఒరిజినల్ వెర్షన్.. దేవత మూవీలోనిదని తెలిసిందే. ఆ సినిమాలో హీరోయిన్ గా శ్రీదేవినే నటించారు. ఆ ఉద్దేశంతో ఆ పాటలో నటించానని పూజా హెగ్డే చెప్పినట్టు ఉన్నారు.

అదే సమయంలో ఛాన్స్ వస్తే శ్రీదేవి బయోపిక్ లో తప్పకుండా నటిస్తానని చెప్పిన పూజ.. ఎవరి బయోపిక్ లో అయినా నటించడం తనకు ఇష్టమేనని తెలిపారు. ప్రస్తుతం పూజ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. శ్రీదేవి బయోపిక్ లో పూజ నటిస్తే ఆమె కూతుళ్లు ఊరుకుంటారా అని నెటిజన్లు అంటున్నారు.

ఛాన్స్ వస్తే వాళ్ళు నటిస్తారు గానీ.. పూజకు ఎందుకు అవకాశం ఇస్తారని కామెంట్లు పెడుతున్నారు. అది ఒక రకంగా నిజమని చెప్పాలి. ఎందుకంటే శ్రీదేవి వారసురాళ్లు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ ఇప్పటికే హీరోయిన్స్ గా తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వైవిధ్యమైన ప్రాజెక్టులు ఎంచుకుంటూ సినీ ప్రియులను అలరిస్తున్నారు. అందుకే తల్లి బయోపిక్ లో నటించేందుకు రెడీగా ఉంటారు.

కాబట్టి శ్రీదేవి బయోపిక్ లో పూజకు ఛాన్స్ రావడం అసాధ్యమేమో. అదే సమయంలో శ్రీదేవి బయోపిక్ పై కొద్ది రోజుల క్రితం ఆమె భర్త బోనీ కపూర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె జీవితం ఎప్పుడూ ప్రైవేట్‌ గానే ఉండాలని ఆయన అన్నారు. శ్రీదేవి బయోపిక్ తెరకెక్కిస్తానంటే తాను అంగీకరించనని చెప్పారు. తాను జీవించి ఉన్నంత వరకు బయోపిక్ రానివ్వనని వ్యాఖ్యానించారు. మరి శ్రీదేవి బయోపిక్ తెరకెక్కుతుందో లేదో వేచి చూడాలి.