Begin typing your search above and press return to search.

అమ్మ‌తోనే కాదు..అమ్మ‌మ్మ‌తోనూ శ్రీలీల ఆటలే!

తాజాగా శ్రీలీ అమ్మ‌మ్మ మీద కూడా ప‌డింది. ఇన్ స్ట్రాగ్రామ్ లో అటలాడుకుంటున్నామంటూ శ్రీలీల న‌వ్వుతుంటే వెనుక‌నే వాళ్ల అమ్మ‌మ్మ ఆ మాట‌లు విని ఓ య‌మ్మా

By:  Tupaki Desk   |   22 May 2025 12:53 PM IST
అమ్మ‌తోనే కాదు..అమ్మ‌మ్మ‌తోనూ శ్రీలీల ఆటలే!
X

తెలుగ‌మ్మాయి శ్రీలీల సోష‌ల్ మీడియాలో యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. గ్లామ‌ర్ ఎలివేష‌న్ కంటే శ్రీలీల స‌ర‌దా వీడియోల‌తోనే ఎక్కువ‌గా వైర‌ల్ అవుతుంది. అమ్మ‌తో స‌ర‌దాగా జోకు లేస్తూ మాట్లాడిన వీడియోలు పోస్ట్ చేస్తుంది. అవి మామ్ ని న‌వ్వించే వి కావొచ్చు..విసిగించేవి కావొచ్చు. వీడియో ఎలాంటిదైనా? అవి మాత్రం నెటి జ‌నుల‌కు మంచి ఆస్వాద‌న‌గా మారుతున్నాయి.

ఇలా మామ్ విత్ శ్రీలీల చాలా వీడియోలు నెట్టింట హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. తాజాగా శ్రీలీ అమ్మ‌మ్మ మీద కూడా ప‌డింది. ఇన్ స్ట్రాగ్రామ్ లో అటలాడుకుంటున్నామంటూ శ్రీలీల న‌వ్వుతుంటే వెనుక‌నే వాళ్ల అమ్మ‌మ్మ ఆ మాట‌లు విని ఓ య‌మ్మా? ఇన్ స్ట్రా గ్రామ్ అంటే ఎక్క‌డికైనా వెళ్లిపోతాయి? అంటే శ్రీలీల ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతుంది. అట్టాంటివి చేయ‌మాకు అమ్మా? అంటూ ప్ర‌కాశం స్లాంగ్ ని దించేసారు పెద్దావిడ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది.

శ్రీలీల అమ్మ‌కు జెరాక్స్ కాపీలా ఉంటుంది. శ్రీలీల మామ్ వాళ్ల‌మ్మ‌కు అచ్చు గుద్దిన‌ట్లు ఉంటారు. ముగ్గురు పొలిక‌లు ఒకేలా ఉంటాయి. ఇలా శ్రీలీల త‌న ఫ్యామిలీని కూడా సోష‌ల్ మీడియాలో సెల‌బ్రి టీలుగా మార్చే స్తుంది. శ్రీలీల మామ్ ఇప్ప‌టికే ఫేమ‌స్. వృత్తిప‌రంగా గైన‌కాల‌జిస్ట్. క‌న్న‌డ సెల‌బ్రిటీ కుటుంబాల‌తో ఆమెకు మంచి పరిచ‌యాలు, స్నేహాలున్నాయి. బెంగుళూరులో ఓన్ హాస్పిట‌ల్స్ క‌ల‌వు.

అలాగే బాలీవుడ్ లోనూ కొన్ని ఫ్యామిలీతో మంచి రిలేష‌న్స్ షిప్స్ ఉన్నాయి. శ్రీలీల ఇటీవ‌లే బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. రెండు..మూడు సినిమాల‌కు అగ్రిమెంట్ కూడా చేసుకుంది. అలాగ‌ని టాలీవుడ్ కి దూరం కాలేదు. ఇక్క‌డ అవ‌కాశాలు వ‌స్తే ఇక్క‌డా సినిమాలు చేస్తుంది.