స్టార్ డైరెక్టర్ తో భారీ బయోపిక్‌కు రంగం సిద్ధం
కాగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజోదారో, పానిపట్ సినిమాలు పీరియాడికల్ డ్రామాలుగానే తెరకెక్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.
By: Tupaki Desk | 12 July 2025 5:16 PM ISTప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో హిస్టారికల్ సినిమాస్, బయోపిక్‌లపై మంచి క్రేజ్ ఉంది. అందులో భాగంగానే నిర్మాతలు మంచి కథలను ఎంచుకుని వాటిని సినిమాలుగా తీసి ఆడియన్స్ ను మెప్పించి క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇండియన్ సినిమాలో మరో బయోపిక్ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఆ బయోపిక్ మరెవరిదో కాదు, విజయ నగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలుది.
ప్రస్తుతం శ్రీ కృష్ణదేవరాయల చరిత్ర ఆధారంగా ఓ భారీ పాన్ ఇండియా సినిమా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించనున్నారని అంటున్నారు. ఈ సినిమాకు లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారట. ఇప్పటికే విష్ణు వర్థన్ గతంలో ఎన్టీఆర్ బయోపిక్, జయలలిత బయోపిక్, కపిల్ దేవ్ బయోపిక్ ను భారీ బడ్జెట్ తో నిర్మించి మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఏకంగా శ్రీ కృష్ణదేవరాయల బయోపిక్ ను నిర్మించి, అందరికీ ఆయన గొప్పదనాన్ని తెలియచేయాలని పూనుకున్నారని తెలుస్తోంది.
కాగా అశుతోష్ గోవారికర్ దర్శకత్వంలో వచ్చిన మొహంజోదారో, పానిపట్ సినిమాలు పీరియాడికల్ డ్రామాలుగానే తెరకెక్కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి. ఇప్పుడు ఆయన శ్రీ కృష్ణదేవరాయల బయోపిక్ ను తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సినిమాలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించనుండగా ఇండియన్ సినిమాలోని పలువురు నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే ఛాన్సుంది. కాగా రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార సీక్వెల్ తో పాటూ జై హనుమాన్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
