‘ప్రేమంటే ఇదేరా’ వెంకీ-ప్రీతి జోడి : సన్ రైజర్స్ విజయంతో మీమ్స్..
నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక మరపురాని అనుభవాన్నిచ్చింది.
By: Tupaki Desk | 13 April 2025 2:11 PM ISTనిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఒక మరపురాని అనుభవాన్నిచ్చింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో 246 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించడంతో స్టేడియం హోరెత్తిపోయింది. ఊహకు అందని ఈ విజయాన్ని సాధించినందుకు సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరుస ఓటముల తర్వాత ఇంత గొప్ప విజయం దక్కడంతో సగటు ప్రేక్షకుడు ఆనందానికి అవధుల్లేవు. అయితే ఈ విజయానికి 'ప్రేమంటే ఇదేరా' సినిమాకు సంబంధం ఏంటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ సన్‌రైజర్స్ జట్టును ఎంతగా అభిమానిస్తారో అందరికీ తెలిసిందే. దాదాపు ప్రతి మ్యాచ్‌కు ఆయన తప్పకుండా హాజరవుతారు. మిగతా టాలీవుడ్ స్టార్లు స్టేడియంలో అంతగా కనిపించకపోయినా వెంకటేష్ మాత్రం తన జట్టును ప్రోత్సహించడానికి వస్తూనే ఉంటారు. ఆయన ఆ జట్టుకు యజమాని కాకపోయినా సొంత జట్టులా భావిస్తారు. అభిమానులు కూడా ఆయనతో బాగా కనెక్ట్ అయిపోయారు. ఇక పంజాబ్ కింగ్స్ జట్టు యజమాని ప్రీతీ జింటా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెంకటేష్ మరి- ప్రీతీ జింటా కలిసి 'ప్రేమంటే ఇదేరా' సినిమాలో నటించారు. ఆ సినిమాలో ప్రీతీ జింటాను వెంకటేష్ ఆటపట్టించే సన్నివేశాలు చాలా ఫేమస్. ఇప్పుడు ఆ సన్నివేశాలను మీమ్స్ కోసం విపరీతంగా వాడుతున్నారు.
నిన్నటి మ్యాచ్ ఫలితం.. ఈ సినిమాలోని సన్నివేశాలు ఒకేసారి గుర్తుకు రావడంతో నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. అంతేకాదు, సన్‌రైజర్స్ జట్టును అభిమానులు ముద్దుగా 'కాటేరమ్మ కొడుకులు' అని పిలుచుకుంటారు. సలార్ సినిమా తరహాలో సరైన సమయం వస్తే ఈ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో కూడా పెద్ది, పుష్ప, రంగస్థలం, ఆర్ఆర్ఆర్, దేవర వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల రెఫరెన్సులు ఐపీఎల్ సందర్భాల్లో చాలాసార్లు వినిపించాయి. కాగా, నిన్నటి మ్యాచ్‌కు వెంకటేష్ హాజరు కాలేదు. ఒకవేళ వచ్చి ఉంటే తన ఒకప్పటి హీరోయిన్ ప్రీతీ జింటాతో సరదాగా ముచ్చటించే అవకాశం ఉండేది. ఈసారి మిస్సయినా, మరో మ్యాచ్‌లో అయినా వీరిద్దరూ కలుసుకుంటారేమో చూడాలి.