Begin typing your search above and press return to search.

రెడ్ శారీలో ఘాటు మిర్చిలా సెగలు పుట్టిస్తున్న శ్రియా శరన్!

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇస్తూ తమను తాము ప్రూవ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   3 Sept 2025 9:00 PM IST
రెడ్ శారీలో ఘాటు మిర్చిలా సెగలు పుట్టిస్తున్న శ్రియా శరన్!
X

ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇస్తూ తమను తాము ప్రూవ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. అలా రీ ఎంట్రీ ఇస్తున్న వారిలో కొంతమంది గుర్తుపట్టలేనంతగా మారిపోతే.. ఇంకొంతమంది అదే ఫిట్నెస్, అదే అందం మెయింటైన్ చేస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవలే నారా రోహిత్ హీరోగా నటించిన 'సుందరకాండ' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన అందంతో అందరి దృష్టిని ఆకట్టుకుంది శ్రీదేవి విజయ్ కుమార్. ఇప్పుడు ఈ జాబితాలోకి శ్రియా శరన్ కూడా చేరిపోయిన విషయం తెలిసిందే. 42 ఏళ్ల వయసులో కూడా.. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా అయితే తన అందంతో అందరిని ఆకట్టుకుందో.. ఇప్పుడు కూడా అదే అందంతో ప్రేక్షకులను అలరిస్తుండడం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా అందం విషయంలో యంగ్ హీరోయిన్ లకు గట్టి పోటీ ఇస్తూ ఫోటోలు షేర్ చేస్తూ.. వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా శ్రియా శరణ్ కూడా వరుస అవకాశాలు అందుకోవడమే కాకుండా ఇలా తన గ్లామర్ తో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని కూడా పెంచుకునే పనిలో పడింది. అందులో భాగంగానే ఇంస్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. రెడ్ కలర్ సిల్క్ చీర కట్టుకొని తన అందాన్ని మరింత ఎలివేట్ చేసింది. రెడ్ చీరలో ఘాటు మిర్చీలా సెగలు పు ట్టిస్తోంది అంటూ ఫాలోవర్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. తన అందాన్ని మరింత రెట్టింపు చేసుకున్న శ్రియా శరణ్ తాజాగా షేర్ చేసుకున్న ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

శ్రియా శరణ్ సినిమాలు..

ప్రస్తుతం ఈమె యంగ్ హీరో తేజ సజ్జ నటిస్తున్న 'మిరాయ్' సినిమాలో నటిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్ , టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. సెప్టెంబర్ 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో శ్రియా శరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే మేకర్స్ ఈమె పాత్రను 'అంబికా'గా పరిచయం చేస్తూ ఒక ప్రత్యేకమైన పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో ఒక పవర్ఫుల్ మదర్ పాత్రలో శ్రియా నటిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఎమోషన్ తో ఉండబోతుందని, సూపర్ హీరో ప్రయాణం వెనుక ఉన్న ఎమోషన్స్ ను ఈమె పాత్ర హైలెట్ చేయనుందని సమాచారం.

రీ ఎంట్రీలో వరుస అవకాశాలు..

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న శ్రియా శరణ్ ఆ తర్వాత.. రెట్రో, మ్యూజిక్ స్కూల్, కబ్జా దృశ్యం 2, గమనం వంటి చిత్రాలలో నటించి.. ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.