Begin typing your search above and press return to search.

వీడియో : అందంతో కవ్విస్తోన్న రాములమ్మ

బుల్లి తెర ద్వారా యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు సుదీర్ఘ కాలంగా వినోదాన్ని పంచుతున్న ముద్దుగుమ్మ శ్రీముఖి.

By:  Tupaki Desk   |   6 Dec 2023 7:36 AM GMT
వీడియో : అందంతో కవ్విస్తోన్న రాములమ్మ
X

బుల్లి తెర ద్వారా యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు సుదీర్ఘ కాలంగా వినోదాన్ని పంచుతున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. బుల్లి తెర రాములమ్మ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే శ్రీముఖి సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా తన అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్ కి కనుల విందు చేస్తూ ఉంటుంది.


తాజాగా మరోసారి శ్రీముఖి ఒక వీడియో ని షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. థాయిలాండ్‌ హ్యాష్ ట్యాగ్‌ పెట్టి ఈ వీడియోను శ్రీముఖి షేర్‌ చేసింది. అంటే ప్రస్తుతం ఈ అమ్మడు అక్కడ స్నేహితులతో కలిసి హాలీడేస్ ను ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

గతంలో కాస్త బరువు ఎక్కువగా అనిపించిన శ్రీముఖి ఇప్పుడు సన్నబడి స్టార్‌ హీరోయిన్స్ కి పోటీ అన్నట్లుగా నిలుస్తోంది. చిరంజీవి సినిమా భోళా శంకర్‌ లో ఇటీవల నటించిన ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించాలని కోరుకుంటున్నట్లుగా ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తాజా వీడియో లో శ్రీముఖి అందం స్టార్‌ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గలేదు. ఇక వీడియో చివర్లో సముద్రం లో నిల్చుని ఉన్న శ్రీముఖి ని ఒక పెద్ద అల ఢీ కొట్టడం, ఒక్కసారిగా ఆమె షాక్‌ అవ్వడం చూడవచ్చు. మొత్తానికి ఈ వీడియో వైరల్‌ అవుతోంది