Begin typing your search above and press return to search.

శ్రీలీల కిస్సులో మునిగిన నితిన్

లవర్ బాయ్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' మ్యూజికల్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి.

By:  Tupaki Desk   |   22 Nov 2023 9:30 AM GMT
శ్రీలీల కిస్సులో మునిగిన నితిన్
X

లవర్ బాయ్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్' మ్యూజికల్ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్ సరసన యంగ్ సెన్సేషన్ శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతోంది.


రీసెంట్ గానే ఈ మూవీ నుంచి 'బ్రష్ వేసుకో' అనే సాంగ్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హరీష్ జయరాజ్ కంపోజ్ చేసిన ఈ పాటని సంజిత్ హెగ్డే ఆలపించారు. ఆడియన్స్ నుంచి ఈ పాటకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ నుంచి ఓ మాస్ నంబర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రస్తుతం మూవీ టీం జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో నితిన్, శ్రీలీలపై ఓ మాస్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.

శంషాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో సుమారు 300 మందికి పైగా డాన్సర్లు ఈ పాటలో పాల్గొంటున్నట్లు తెలిసింది. తాజాగా ఈ మాస్ సాంగ్ కి సంబంధించిన ఓ పిక్ నెట్టింట దర్శనమిచ్చింది. ఇందులో శశ్రీలీల నితిన్ బుగ్గపై ముద్దు పెడుతూ కనిపించింది. వెనకాలే డాన్సర్స్ అందరూ గుంపుగా ఉన్నారు. ఈ పిక్ తో సాంగ్ ఎంత మాస్ గా ఉంటుందో చెప్పకనే చెప్పారు మేకర్స్.

నితిన్, శ్రీలీల ఇద్దరూ మంచి డాన్సర్స్ కావడంతో జానీ మాస్టర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సాంగ్లో అదిరిపోయే స్టెప్స్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే ఈ మాస్ నంబర్ ని రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. క్యారెక్టర్ బేస్డ్ స్టోరీ తో రూపొందిన ఈ మూవీలో నితిన్ మునుపెన్నడూ కనిపించని సరికొత్త లుక్ లో ఆడియన్స్ ని అలరించబోతున్నాడు.

ఆదిత్య మూవీస్ అండ్ రుచిరా ఎంటర్టైన్మెంట్ సహకారంతో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదట క్రిస్మస్ కానుకగా సినిమాని విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ ఆ సమయానికి ప్రభాస్ 'సలార్' రిలీజ్ ఉండడంతో మేకర్స్ వెనక్కి తగ్గి డిసెంబర్ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.