Begin typing your search above and press return to search.

శ్రీవిష్ణు గాడి అచ్చ తెలుగు సినిమా

రాజా రాజా చోర.. హీరో శ్రీవిష్ణు- దర్శకుడు హసిత్ గోలి కాంబోలో వచ్చిన ఈ మూవీ మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   28 Feb 2024 7:45 AM GMT
శ్రీవిష్ణు గాడి అచ్చ తెలుగు సినిమా
X

రాజా రాజా చోర.. హీరో శ్రీవిష్ణు- దర్శకుడు హసిత్ గోలి కాంబోలో వచ్చిన ఈ మూవీ మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో మామూలుగా నవ్వులు పూయించలేదు మేకర్స్. ఇప్పుడు ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ వీరిద్దరి కాంబోలో సినిమా చేయనున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం 32గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రేపు(ఫిబ్రవరి 29వ తేదీ) అధికారికంగా ప్రకటించి టైటిల్ రివీల్ చేయనున్నారు మేకర్స్. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలిపారు. ఈ మూవీ టైటిల్‌ ను రేపు శ్రీవిష్ణు పుట్టినరోజు సందర్భంగా ప్రకటించనున్నారు. అయితే అనౌన్స్మెంట్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇదొక స్వచ్ఛమైన తెలుగు సినిమా అని చెబుతూ టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ కు నామకరణం ఈవెంట్ అని పేరు పెట్టారు మేకర్స్. మరో సూపర్ కాంబో.. టైటిల్ ప్రకటన రేపే.. విశ్వప్రసాద్ నిర్మిత .. హసిత్ గోలి గాడి రాత, తీతలో.. మన శ్రీవిష్ణు గాడి కొత్త సినిమా నామకరణం అట.. అని పోస్టర్ పై ఉన్న వ్యాఖ్యలు ఫుల్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. "వెయిట్ అప్! మీరు పక్కాగా సంతృప్తి చెందుతారు" అని పోస్టర్ లో మేకర్స్ పేర్కొన్నారు.

అయితే ఈ చిత్రం మరింత ఎంటర్టైనింగ్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. రాజా రాజా చోర సినిమాతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హసిత్ గోలి.. ఈ మూవీలో శ్రీవిష్ణును మరో ఇంట్రెస్టింగ్ రోల్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

ఇక శ్రీవిష్ణు కూడా తన చివరి చిత్రం సామజవరగమనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. త్వరలోనే ఓం భీమ్ బుష్ సినిమాతో రానున్నారు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణన్ తో కలిసి చేస్తున్న ఆ మూవీ మార్చి 22న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సినీ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. మరి మంచి ఫామ్ లో ఉన్న శ్రీవిష్ణు నటించిన కొత్త సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి.