Begin typing your search above and press return to search.

మాస్ డైరెక్టర్ కాంపౌండ్ లో శ్రీవిష్ణు.. ఇది క్రేజీ కాంబినేషన్!

యంగ్ హీరో శ్రీవిష్ణు వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ కెరియర్ లో నెక్స్ట్ లెవల్ కి వెళ్తున్నాడు

By:  Tupaki Desk   |   9 April 2024 11:49 AM GMT
మాస్ డైరెక్టర్ కాంపౌండ్ లో శ్రీవిష్ణు.. ఇది క్రేజీ కాంబినేషన్!
X

యంగ్ హీరో శ్రీవిష్ణు వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ కెరియర్ లో నెక్స్ట్ లెవల్ కి వెళ్తున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులకి కావాల్సినంత వినోదాన్ని అందిస్తూ కొత్త దర్శకులకి కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్నాడు. మంచి ఎంటర్టైన్మెంట్ కథ సిద్ధం చేసుకొని శ్రీవిష్ణు దగ్గరకి వెళ్తే కచ్చితంగా ఛాన్స్ వస్తుందనే నమ్మకంతో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు.

ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో శ్రీవిష్ణు మరోహిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు వచ్చిన సామజవరగమన అనే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది. ఎలాంటి సినిమా చేసినా కూడా ఈ హీరో మినిమమ్ హిట్ అందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పుడు అతను ఒక ఒక క్రేజీ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడు.

మాస్ కమర్షియల్ డైరెక్టర్ బాబీ నిర్మాతగా చేయబోయే మొదటి సినిమాలో ఈ హీరో ఛాన్స్ అందుకున్నాడు. కోన వెంకట్, బాబీ సమర్పణలో స్కంద వాహన మోషన్ పిక్చర్స్, విజిల్ వర్తీ ఫిలిమ్స్, కె.ఎఫ్.సీ సంయుక్తంగా శ్రీవిష్ణు 19వ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.

ఈ చిత్రంతో జానకి రామ్ మారెళ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అవుట్ అండ్ అవుట్ హీలేరియర్ ఎంటర్టైన్మెంట్ గానే ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా లాంచింగ్ వేడుకలో నవీన్ యెర్నేని, నందిని రెడ్డి, కిషోర్ తిరుమల స్క్రిప్ట్ ని దర్శకుడికి అందించారు. ఈ చిత్రానికి విజయ్ బలగానిన్ సంగీతం అందిస్తూ ఉండటం విశేషం.

సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా చేయనుండగా చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ చేయనున్నారు. సామజవరగమన సినిమాకి రైటర్స్ గా వర్క్ చేసిన భాను భోగవరపు, నందు సవిరిగాన ఈ చిత్రానికి కూడా రచయితలుగా వర్క్ చేస్తూ ఉండడం విశేషం. వరుసగా రెండు హిట్స్ తో జోరు మీద ఉన్న శ్రీవిష్ణు ఈ మూవీతో హ్యాట్రిక్ హిట్స్ ని ఖాతాలో వేసుకోవాలని అనుకుంటున్నారు.

ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కచ్చితంగా ఈ మూవీ అందరికి నచ్చే ఎంటర్టైన్మెంట్ తోనే ఉంటుందని తెలిపారు. శ్రీవిష్ణు నుంచి ప్రేక్షకులు ఆశించి అన్ని అంశాలు ఇందులో ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. కమర్షియల్ డైరెక్టర్ గా సక్సెస్ అయిన బాబీ నిర్మాతగా ఈ మూవీతో ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కోన వెంకట్ కూడా ఈ చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉన్నట్లు తెలుస్తోంది.