Begin typing your search above and press return to search.

గీత ఆర్ట్స్ నుంచి కుర్ర హీరోకి బర్త్ డే గిఫ్ట్.. అదిరింది!

నేడు పుట్టిన రోజు సందర్భంగా #SV18 ను గ్రాండ్ గా వీడియో ద్వారా రివీల్ చేశారు. గీతా ఆర్ట్స్ నుండి శ్రీవిష్ణుకి బహుమతి అందుతుంది.

By:  Tupaki Desk   |   29 Feb 2024 1:44 PM GMT
గీత ఆర్ట్స్ నుంచి కుర్ర హీరోకి బర్త్ డే గిఫ్ట్.. అదిరింది!
X

విభిన్నమైన కథలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటున్న శ్రీవిష్ణు రాబోయే రోజుల్లో మరిన్ని వినూత్న కథలను తెరపైకి తీసుకు రాబోతున్నాడు. గత రెండేళ్లుగా అతని సక్సెస్ రేటు కీడా పెరిగింది. ప్రస్తుతం ఓం భీమ్ బుష్ సినిమా ప్రమోషన్స్ లో హడావుడి గా కనిపిస్తున్న శ్రీవిష్ణు తన పుట్టినరోజు సందర్భంగా లైనప్ లో ఉన్న ప్రాజెక్టు లపై వరుస అప్డేట్స్ ఇస్తున్నాడు.

ఇక అతని లిస్టులో గీత ఆర్ట్స్ లాంటి సంస్థ సమర్పణలో కూడా ఒక సినిమా రాబోతుండడం విశేషం. శ్రీ విష్ణు SV18 ప్రాజెక్టుగా ఆ సినిమా రాబోతోంది. నిను వీడని నీడను నేనే ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వం వహించే అంసినిమాను గీతా ఆర్ట్స్‌తో కలిసి, కళ్యా ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ప్రొడ్యూసర్స్ గా ఉన్నారు.

నేడు పుట్టిన రోజు సందర్భంగా #SV18 ను గ్రాండ్ గా వీడియో ద్వారా రివీల్ చేశారు. గీతా ఆర్ట్స్ నుండి శ్రీవిష్ణుకి బహుమతి అందుతుంది. బహుమతి పెట్టె లోపల ఒక పజిల్ ఉందని అతను కనుగొన్నాడు. అతను పజిల్‌ని పరిష్కరించినప్పుడు, అది గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తన కొత్త సినిమా గురించి అని తెలుసుకుంటాడు.

చాలా కాలంగా పెద్ద బ్యానర్‌లో పనిచేయాలని ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకి ఇది మంచి పుట్టినరోజు ప్రెజెంటేషన్. #SV18 ఒక మంచి ప్రేమకథతో పాటు మంచి కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందట. ప్రముఖ టెక్నీషియన్లు ఈ క్రేజీయన్స్ ఈ కాంబినేషన్ కోసం వర్క్ చేయనున్నారు.

ఇక మరోవైపు శ్రీ విష్ణు మరికొన్ని క్రేజీ కథలను లైన్ లో పెట్టాడు.

ఇప్పటికే ఓం భీమ్ బుష్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమాలో రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్యమైన పాత్రలలో నటించారు. అలాగే పీపుల్స్ మిడియా ఫ్యాక్టరీ లో కూడా శ్రీవిష్ణు స్వాగ్ అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా కూడా డిఫరెంట్ కామెడీ జానర్ లో రానుంది. ఈ విధంగా శ్రీవిష్ణు ప్రముఖ బ్యానర్స్ లలో డిఫరెంట్ సినిమాలు చేస్తున్నాడు.