Begin typing your search above and press return to search.

సింగిల్ ను రిజెక్ట్ చేసిన హీరోలంద‌రికీ థాంక్స్

శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన సింగిల్ సినిమా స‌మ్మ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది.

By:  Tupaki Desk   |   17 May 2025 5:48 AM
సింగిల్ ను రిజెక్ట్ చేసిన హీరోలంద‌రికీ థాంక్స్
X

శ్రీవిష్ణు హీరోగా కార్తీక్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌చ్చిన సింగిల్ సినిమా స‌మ్మ‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. మే 9న ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆడియ‌న్స్ ను అల‌రించ‌డ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి క‌లెక్ష‌న్ల‌ను అందుకుంటుంది. సింగిల్ స‌క్సెస్ అయిన సంద‌ర్భంగా చిత్ర యూనిట్ స‌క్సెస్ మీట్ ను ఏర్పాటు చేయ‌గా అందులో సింగిల్ టీమ్ తో పాటూ టాలీవుడ్ లోని ప‌లువురు డైరెక్ట‌ర్లు పాల్గొన్నారు.

సింగిల్ సినిమా ర‌షెస్ చూసిన‌ప్పుడే శ్రీవిష్ణు ను పిలిచి గీతా ఆర్ట్స్ లో మ‌రో రెండు సినిమాల‌కు డీల్ కుదుర్చుకుంటూ చెక్ ఇచ్చాన‌ని, మ‌నిషిగా, యాక్ట‌ర్ గా శ్రీవిష్ణు చాలా న‌చ్చాడ‌ని, సినిమా బావుంటే థియేట‌ర్ల‌కు వ‌స్తామ‌ని సింగిల్ తో మ‌రోసారి ప్రూవ్ చేసిన ఆడియ‌న్స్ కు చాలా మ‌నస్పూర్తిగా థ్యాంక్స్ అని నిర్మాత అల్లు అర‌వింద్ అన్నారు. కార్తీక్ సింగిల్ ను ఎంతో అద్భుతంగా తీశాడ‌ని, ఈ సినిమాతో వెన్నెల కిషోర్ తో కాస్త అనుబంధం పెరిగింద‌ని, నిర్మాత విద్య మా అమ్మాయి అని, ఈ సినిమాతో త‌ను స‌క్సెస్ అందుకోవ‌డం ఎంతో సంతోషంగా ఉంద‌న్నారు.

సింగిల్ క‌థ‌ను డైరెక్ట‌ర్ నాకంటే ముందు మ‌రో 15 మందికి వినిపించాడ‌ని, కానీ వాళ్లంతా దాన్ని రిజెక్ట్ చేశార‌ని, రిజెక్ట్ చేసిన వాళ్లంద‌రికీ థాంక్స్ అని చెప్పాడు హీరో శ్రీవిష్ణు. సింగిల్ సినిమాను ఎంతో క‌సిగా చేశామ‌ని, నాతో పాటూ నా క‌సిలో పాలుపంచుకున్న వెన్నెల కిషోర్ కు థాంక్స్, ఈ సినిమాకు మొద‌టి నుంచి ప్రొడ‌క్ష‌న్ టీమ్ మొత్తం చాలా స‌పోర్ట్ చేసింద‌ని, విద్య గారి కోస‌మైనా సినిమా స‌క్సెస్ అవాల‌ని బ‌లంగా కోరుకున్నాన‌ని, మ‌నం సిన్సియ‌ర్ గా ప‌ని చేస్తే దేవుడు మ‌న‌కు కావాల్సింది తిరిగిస్తాడ‌ని సింగిల్ సినిమా మ‌రోసారి ప్రూవ్ చేసింద‌ని శ్రీవిష్ణు చెప్పాడు. అర‌వింద్ గారితో జ‌ర్నీని చాలా ఎంజాయ్ చేశాను, హీరోయిన్లు ఇద్ద‌రూ చాలా బాగా చేశారు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్ర‌తీ ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు అని చెప్పాడు శ్రీవిష్ణు.

అల్లు అర‌వింద్ గారితో టైం స్పెండ్ చేయ‌డాన్ని ఎంతో చేశాన‌ని చెప్పిన వెన్నెల కిషోర్ డైరెక్ట‌ర్ కార్తీక్ చాలా జెన్యూన్ అని, శ్రీవిష్ణుతో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని ఉంద‌ని చెప్పాడు. కేతిక‌, ఇవాన చాలా బాగా న‌టించార‌ని, నిర్మాత‌ల‌కు, చిత్ర యూనిట్ కు స్పెష‌ల్ థ్యాంక్స్ అన్నాడు. హీరోయిన్ కేతిక శ‌ర్మ మాట్లాడుతూ, సింగిల్ సినిమాలో న‌టించ‌డం త‌న అదృష్ట‌మ‌ని, ఈ అవ‌కాశ‌మిచ్చిన నిర్మాత‌ల‌కు థాంక్స్ అని, శ్రీవిష్ణు తన ఫేవ‌రెట్ కోస్టార్ అని, ఆయ‌న చేసే సినిమాలంటే త‌న‌కు చాలా గౌర‌వ‌మ‌ని, సింగిల్ ను హిట్ చేసిన ఆడియ‌న్స్ కు థాంక్స్ చెప్పింది.

మూడేళ్ల కింద‌ట శ్రీవిష్ణుకు ఈ క‌థ చెప్పాన‌ని, అప్ప‌ట్నుంచి ఆయ‌న ఈ సినిమాకు స‌పోర్ట్ చేస్తూనే ఉన్నారని, కిషోర్ కు పెద్ద అభిమానిన‌ని, ఆయ‌న్ను ఊహించుకునే సింగిల్ లో క్యారెక్ట‌ర్ ను రాసుకున్నాన‌ని, ఈ మూవీని జీవితాంతం మ‌ర్చిపోలేన‌ని డైరెక్ట‌ర్ కార్తీక్ రాజు చెప్పాడు. త‌న‌కు ఈ అవ‌కాశం ఇచ్చిన అల్లు అరవింద్ కు నిర్మాత విద్య ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెప్పింది. శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ గ్యాప్ లేకుండా ఆడియ‌న్స్ ను న‌వ్విస్తూనే ఉన్నార‌ని, హీరోయిన్లు బాగా న‌టించార‌ని, టీమ్ మొత్తం సినిమాకు చాలా స‌పోర్ట్ చేశార‌ని అంద‌రికీ థాంక్యూ అని చెప్పింది విద్య‌.

ఆడియ‌న్స్ థియేట‌ర్ల‌కు రావ‌డం క‌ష్ట‌మ‌వుతున్న ఈ రోజుల్లో సింగిల్ హౌస్‌ఫుల్స్ తో నిండిపోవ‌డం సంతోషంగా ఉంద‌ని డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి అన్నారు. చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పిన వంశీ, ఇంత మంది నిర్మాత‌ల‌ను ఇండ‌స్ట్రీకి ఇచ్చిన అర‌వింద్ గారికి థాంక్యూ, హ్యాట్రిక్ అందుకున్న గీతా ఆర్ట్స్ కు బిగ్ కంగ్రాట్యులేష‌న్స్ అన్నారు.

ఇండ‌స్ట్రీకి స‌క్సెస్ ఎంతో అవ‌స‌ర‌మైన టైమ్ లో గీతా ఆర్ట్స్ లో రెండు హిట్స్ అందుకున్న అర‌వింద్ కి కంగ్రాట్యులేష‌న్స్ చెప్పిన అనిల్ రావిపూడి చిత్ర యూనిట్ మొత్తానికి కంగ్రాట్స్ చెప్పాడు. విష్ణు త‌నకెంతో క్లోజ్ అయిన‌ప్ప‌టికీ తాను క‌నిపెట్టిన లాంగ్వేజ్ ఏంట‌న్న‌ది తెలుసుకోలేక‌పోయాన‌ని, ఫ్యూచ‌ర్ లో విష్ణు టైమింగ్ ను క‌చ్ఛితంగా వాడుకుంటాన‌ని అనిల్, త‌ప్ప‌కుండా సింగిల్ ను స‌మ్మ‌ర్ లో చూసి ఎంజాయ్ చేయ‌మ‌ని చెప్పాడు.

సింగిల్ సినిమా చాలా బావుంద‌ని, శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ కామెడీ బాగా వ‌ర్క‌వుట్ అయింద‌ని, చిత్ర యూనిట్ ప‌డిన క‌ష్టం స్క్రీన్ పై క‌నిపించింద‌ని, క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం అందుకుంటున్న సింగిల్ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ తెలిపారు ఈ ఈవెంట్ లో పాల్గొన్న డైరెక్ట‌ర్లు కిషోర్ తిరుమ‌ల‌, హసిత్ గోలి, వివేక్ ఆత్రేయ, రామ్ అబ్బ‌రాజు, ఎస్‌కెఎన్, బ‌న్నీ వాసు.