శ్రీవిష్ణుకు సుక్కూ శిష్యుడు హిట్ ఇస్తారా?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యులు.. అదే అసిస్టెంట్లు, రైటర్లుగా వర్క్ చేసి ఇండస్ట్రీకి వచ్చాక తమదైన ముద్ర వేస్తున్నారు.
By: M Prashanth | 2 March 2026 6:00 PM ISTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యులు.. అదే అసిస్టెంట్లు, రైటర్లుగా వర్క్ చేసి ఇండస్ట్రీకి వచ్చాక తమదైన ముద్ర వేస్తున్నారు. స్టోరీల ఎంపికలో కొత్తదనం, టెక్నికల్ గా స్ట్రాంగ్ నేరేషన్, థ్రిల్లింగ్ స్క్రీన్ ప్లేతో మెప్పిస్తున్నారు. ఇప్పటికే ఆయన శిష్యుల నుంచి వచ్చిన సినిమాలు మంచి హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మరో స్టూడెంట్ హుస్సేన్ షా కిరణ్ అప్ కమింగ్ మూవీపై అందరి దృష్టి పడింది.
యంగ్ హీరో శ్రీవిష్ణుతో ఆయన సస్పెన్స్ థ్రిల్లర్ మృత్యుంజయ్ తెరకెక్కించగా.. మరికొద్ది రోజుల్లో ఆ సినిమా రిలీజ్ కానుంది. అయితే హుస్సేన్ షా కిరణ్ గతంలో నాన్నకు ప్రేమతో చిత్రానికి రైటర్ గా పనిచేశారు. 2016లో మీకు మీరే మాకు మేమే (M2M2)తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇప్పుడు మరింత పక్కా కథతో, బిగ్ స్క్రీన్ థ్రిల్లర్ మృత్యుంజయ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
అయితే శ్రీవిష్ణు ఇప్పటికే కామెడీ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను నవ్వించే హీరోగా స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు. నేచురల్ యాక్టింగ్, టైమింగ్, కథల ఎంపికలో వైవిధ్యం ఆయన స్పెషాలిటీ అని చెప్పాలి. అయితే ఈసారి కంప్లీట్ థ్రిల్లర్ జోనర్ లో మృత్యుంజయ్ సినిమా చేయడం ఆసక్తికరంగా మారింది. కొత్త తరహా పాత్రలో ఆయన ఎలా మెప్పిస్తారోనని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే మృత్యుంజయ్ మూవీ నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ ను ఫుల్ గా పెంచేశాయి. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కథలోని ట్విస్టులు.. సిల్వర్ స్క్రీన్ పై థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ప్రతి ఫ్రేమ్ లో టెన్షన్, మిస్టరీ కనిపిస్తుండటంతో థ్రిల్లర్ లవర్స్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమాలో శ్రీవిష్ణుకు జోడీగా రేబా మోనికా జాన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన సామజవరగమన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ కాంబో రిపీట్ కావడంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. రచ్చ రవి, సిజ్జు, అయ్యప్ప, బాలాదిత్య, కృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కథలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం.
నిర్మాణ విలువల పరంగా కూడా రాజీ పడకుండా ప్రొడ్యూసర్లు తెరకెక్కించారు. రమ్యం గున్నం సమర్పణలో లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి రూపొందించారు. మరి మార్చి 6న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సుకుమార్ శిష్యుడు తన గురువు స్టైల్ కు తగ్గట్టుగా విష్ణుకు మరో హిట్ అందిస్తారా? అదే సమయంలో విష్ణు థ్రిల్లర్ జానర్ లో సక్సెస్ అవుతారా? అనేది వేచి చూడాలి.
