Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ తో నటించాలని ఉందట

శ్రీశాంత్ మాట్లాడుతూ.. ఎప్పటికైనా ఎన్టీఆర్‌ తో కలిసి నటించాలని ఉంది. ఎన్టీఆర్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం.

By:  Tupaki Desk   |   22 Feb 2024 5:40 AM GMT
ఎన్టీఆర్‌ తో నటించాలని ఉందట
X

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్‌ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ కి పాన్ ఇండియా మించి ఫాలోయింగ్‌ ఏర్పడింది. విదేశాల్లో కూడా ఎన్టీఆర్ కి అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ జాబితాలో సినీ మరియు క్రీడా ప్రముఖులు ఉన్నారు.

తాజాగా టీం ఇండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్టీఆర్‌ పై తనకు ఉన్న అభిమానం చూపుతూ శ్రీశాంత్‌ తాజా ఇంటర్వ్యూలో కామెంట్స్ చేశాడు. ఆ వ్యాఖ్యలు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కి బాగా కిక్‌ ఇస్తున్నాయి. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు.

శ్రీశాంత్ మాట్లాడుతూ.. ఎప్పటికైనా ఎన్టీఆర్‌ తో కలిసి నటించాలని ఉంది. ఎన్టీఆర్‌ నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డాన్స్ కి చాలా మందితో పాటు నేను ఫ్యాన్‌ ని. గతంలో ఒక సారి నేను ఎన్టీఆర్‌ ను కలిశాను. ఆ సమయంలో ఎన్టీఆర్ తో మాట్లాడాను.

మీరు బాగా డాన్స్ చేస్తారు అని చెప్పాను. దానికి ఆయన థాంక్స్ చెప్పడంతో పాటు సరదాగా ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు. ఎన్టీఆర్‌ ను చూస్తే మోటివేట్‌ గా ఉంటుంది. నేను, ఎన్టీఆర్ ను కలిసిన సమయంలో ఆ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ కూడా ఉన్నాడని శ్రీశాంత్ పేర్కొన్నాడు.

ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దేవర ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు.

మరో వైపు శ్రీశాంత్‌ ఈ మధ్య కాలంలో ఆట కంటే కూడా ఎక్కువగా సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. నటుడిగా ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించాడు. కనుక ఎన్టీఆర్ సినిమాలో శ్రీశాంత్‌ ను విలన్ గా తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం ను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.