Begin typing your search above and press return to search.

బౌన్స్ బ్యాక్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు

రీసెంట్​గా కూడా ఇటలీలోని మౌంటెరాలో షూట్ ప్రారంభించనున్నట్లు తెలుపుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   5 Oct 2023 7:29 AM GMT
బౌన్స్ బ్యాక్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు
X

చాలా కాలంగా మ్యాచో స్టార్​ గోపీచంద్‌ - ఫన్ డైరెక్టర్​ శ్రీనువైట్ల సరైన హిట్ లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గట్టి కమ్ బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా వర్కౌట్ అవ్వట్లేదు. అయితే ఈ మధ్యే ఈ ఇద్దరు చేతులు కలిపి.. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్​తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.

వీరిద్దరి కాంబోలో రూపొందుతున్న మొదటి చిత్రం ఇదే. రీసెంట్​గా ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో గ్రాండ్​గా ప్రారంభమైంది. ఈ చిత్రంతో ఎలాగైన గట్టి హిట్ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. సినిమాకు సంబంధించిన ఎక్కడ రాజీ పడకుండా హైస్టాండర్డ్స్​తో తెరకెక్కిస్తున్నారని అర్థమవుతోంది. షూటింగ్ మొత్తాన్ని తమ కథకు తగ్గట్టు విదేశాల్లోనే చిత్రీకరిస్తున్నారు. ఇటలీలో ఎక్కువ భాగాన్ని షూట్ చేయనున్నట్లు తెలిసింది.

రీసెంట్​గా కూడా ఇటలీలోని మౌంటెరాలో షూట్ ప్రారంభించనున్నట్లు తెలుపుతూ ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తాజాగా మరో కొత్త వీడియోను శ్రీనువైట్ల పోస్ట్ చేశారు. ఇందులో ఇటలీ ఫైనాన్షియల్ హబ్​, ఫ్యాషన్​కు కేరాఫ్ అడ్రస్ అయిన టూరిస్ట్​ సిటీ మిలాన్​లో ఫిల్మ్ షూటింగ్ ప్రారంభమైనట్లు చూపించారు.

ఇంకా ఈ వీడియోలో శ్రీనువైట్ల 360 డిగ్రీస్​ ఓ కాస్ట్లీ కెమెరాతో స్క్రిప్ట్ పేపర్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ కనిపించారు. సిటీ లొకేషన్​ను ఏరియల్ వ్యూలో బాగా చూపించారు. ఇదంతా చూస్తుంటే శ్రీనువైట్ల - గోపిచంద్​ బౌన్స్ బ్యాక్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది.

ఇకపోతే ఈ చిత్రానికి అందరూ సీనియర్​ వ్యక్తులే పని చేస్తున్నారు. ప్రముఖ రచయిత గోపీ మోహన్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. గతంలో శ్రీను వైట్ల- గోపిమోహన్​ కాంబోలో 'వెంకీ', 'ఢీ', 'దుబాయ్ శీను', 'రెడీ', 'కింగ్', 'నమో వేంకటేశ', 'బ్రూస్ లీ' చిత్రాలు వచ్చాయి.

అలాగే గోపీచంద్ నటించిన 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాలకు కూడా గోపి మోహన్​ వర్క్ చేశారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కెవి గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చూడాలి మరి వీరి ప్రయత్నాలు ఏ మాత్రం వరకు ఫలిస్తాయో...