Begin typing your search above and press return to search.

డ్ర‌గ్స్ ఇవ్వ‌క‌పోతే న‌టించ‌లేడు.. నిర్మాత ఆరోప‌ణ‌

అయితే అప్ప‌టికే అత‌డి కార‌వ్యాన్ లో సామాగ్రి ఉంది. అత‌డు దాని లోనికి ఎవ‌రినీ రానివ్వ‌డు. అత‌డు పొగ తాగేందుకే కార‌వ్యాన్ లోకి వెళ్లేవాడు. ఇదంతా గాంజా తాగేందుకేన‌ని నిర్మాత ఆరోపించారు.

By:  Tupaki Desk   |   18 April 2025 6:53 PM IST
డ్ర‌గ్స్ ఇవ్వ‌క‌పోతే న‌టించ‌లేడు.. నిర్మాత ఆరోప‌ణ‌
X

మ‌ల‌యాళ న‌టుడు షైన్ టామ్ చాకోపై డ్ర‌గ్స్ సేవించాడ‌ని న‌టి ఆరోపించిన క్ర‌మంలో, ఇప్పుడు మ‌రో ప్ర‌ముఖ న‌టుడి పేరు కూడా డ్ర‌గ్స్ వినియోగంతో సంబంధాలున్నాయ‌ని మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. అత‌డు ఒక రాత్రి త‌న‌కు డ్ర‌గ్స్ తేవాల‌ని ఆదేశించాడ‌ని త‌న సినిమా నిర్మాత నేరుగా ఆరోపించ‌డంతో ఇప్పుడు ఈ కేసు హాట్ టాపిగ్గా మారుతోంది. ఇటీవ‌ల హైబ్రిడ్ గంజాయి కేసులో అత‌డి పేరు వినిపించింది. కేవ‌లం రెండు వారాల్లోనే మ‌రో వివాదంలో చిక్కుకున్న ఈ న‌టుడి పేరు శ్రీ‌నాథ్ భాసి. అత‌డు వ‌రుస వివాదాల్లో చిక్కుకుంటున్నాడు.

న‌టుడు శ్రీ‌నాథ్ భాసి గంజాయి తీసుకోక‌పోతే స‌రైన మానసిక స్థితిలో ఉండ‌డు! అని కూడా `నముక్కు కోడతియిల్ కానం` (కోర్టులో కలుద్దాం) నిర్మాత హసీబ్ మలబార్ ఆరోపించిన‌ట్టు ఇండియ‌న్ ఎక్స్ ప్రెస్ త‌న క‌థ‌నంలో పేర్కొంది. ఒక రేయి గ‌డిచి తెల్ల‌వారు ఝామున 3 గంట‌ల ప్రాంతంలో ఒక బోయ్ ని పంపించి గంజాయి తేవాల‌ని ఆదేశించాడని హ‌సీబ్ చెబుతున్నారు. పొగ తాగడానికి సామాగ్రి కావాలంటూ అత‌డు అడిగాడు. ఎలాగైనా తీసుకురావాలి కోరాడు. నేను తోడుపుళలో ఉన్నాను.. షూటింగ్ లొకేషన్ కోజికోడ్‌లో ఉంది. తెల్ల‌వారు ఝామున నాకు ఈ ఫోన్ వ‌చ్చింది. అది అందించ‌క‌పోతే అత‌డు షూటింగు చేయ‌లేడు! అని కూడా తెలిపాడు. అయితే షూటింగ్ దెబ్బ తింటుంద‌నే భ‌యంతో తాను ఎవ‌రికీ ఫిర్యాదు చేయ‌లేద‌ని కూడా అన్నారు.

అయితే అప్ప‌టికే అత‌డి కార‌వ్యాన్ లో సామాగ్రి ఉంది. అత‌డు దాని లోనికి ఎవ‌రినీ రానివ్వ‌డు. అత‌డు పొగ తాగేందుకే కార‌వ్యాన్ లోకి వెళ్లేవాడు. ఇదంతా గాంజా తాగేందుకేన‌ని నిర్మాత ఆరోపించారు. పోలీసులు వచ్చి అత‌డిని అక్కడికక్కడే పట్టుకుని ఉంటే కేవ‌లం అప్ప‌టికి మాత్ర‌మే చ‌ర్య తీసుకుని వ‌దిలేస్తారు. డ‌బ్బును కాలువ‌లోకి వ‌దిలేయ‌లేను. దాని బ‌దులు సినిమాను ఏదో ఒక‌లా పూర్తి చేయాల‌ని అనుకున్నాను.. ఇప్ప‌టికీ అత‌డి ప్ర‌వ‌ర్త‌న గురించి తెలియ‌ని నిర్మాత‌లు అవ‌కాశాలిస్తున్నార‌ని కూడా ఆరోపించారు.

శ్రీనాథ్ భాసి డ్రగ్స్ సంబంధిత వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఏడాది క్రితం అత‌డి పేరు ప్రఖ్యాత గ్యాంగ్‌స్టర్ ఓంప్రకాష్ తో ముడిప‌డి వినిపించింది. అంత‌కుముందు సంవ‌త్స‌రం సెట్స్ లో భాసి వికృత ప్రవర్తన, డ్రగ్స్ వాడకం గురించి నిర్మాతల ఆరోపణల నేపథ్యంలో చాలా నిర్మాణ‌ సంస్థలు అతడితో సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. 2022లో ఒక మహిళా యాంకర్‌ను అవమానించారనే ఆరోపణలతో అతడు అరెస్టు అయ్యాడు.