Begin typing your search above and press return to search.

శ్రీలీల.. ఈ సడన్ బ్రేక్ ఎన్ని రోజులో?

భగవంత్ కేసరి, స్కంద, ఎక్స్ట్రాడనరీ మ్యాన్, గుంటూరు కారం, ఆదికేశవ, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా వరుసపెట్టి ఆఫర్లను అందుకుని సందడి చేసింది. ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు షూటింగ్ కంప్లీట్ చేసింది.

By:  Tupaki Desk   |   2 Jan 2024 1:37 PM GMT
శ్రీలీల.. ఈ సడన్ బ్రేక్ ఎన్ని రోజులో?
X

పెళ్లి సందడి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయింది కన్నడ బ్యూటీ శ్రీలీల. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ.. ఈ అమ్మడు అందానికి యమా క్రేజ్ వచ్చింది. టాలీవుడ్ లో వరుసపెట్టి ఆఫర్లు వచ్చాయి. కుర్రహీరోలతో పాటు రవితేజ లాంటి స్టార్ హీరో కూడా ఆమెకు అవకాశం ఇచ్చారు. 2022లో ధమాకాతో తనకెరీర్లో తొలి హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుని మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా మారింది.

2023 అంతా శ్రీలీల చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపింది. భగవంత్ కేసరి, స్కంద, ఎక్స్ట్రాడనరీ మ్యాన్, గుంటూరు కారం, ఆదికేశవ, ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా వరుసపెట్టి ఆఫర్లను అందుకుని సందడి చేసింది. ఓ వైపు చదువుకుంటూ.. మరోవైపు షూటింగ్ కంప్లీట్ చేసింది.

అయితే ఇలా వరుస సినిమాలతో టాప్ ఫామ్లో ఉంటుందనుకున్న శ్రీలీలకు 2023లో వరుసపెట్టి దెబ్బలు తగిలాయి. భగవంత్ కేసరి సూపర్ హిట్ అయినప్పటికీ.. అందులో ఆమెకు పెర్ఫార్మన్స్ పరంగా పేరొచ్చింది. కానీ బాలయ్యతో పాటు స్టోరీ హైలైట్స్ వల్ల ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అభినందనలు రాలేదు.

అంతకంటే ముందు విడుదలైన స్కంద మూవీ మిశ్రమ ఫలితాలను అందుకుంది. అక్కడ కూడా రామ్కు ఉన్న క్రేజ్ ఈ అమ్మడికి రాలేదు. ఇటీవలే వచ్చిన ఆదికేశవ కూడా రోటీన్ కథాంశంతో హిట్ అందుకోలేకపోయింది. దీంతో శ్రీలీలకు అంత స్కోప్ దక్కలేదు. అయితే మహేశ్ గుంటూరు కారం, పవన్ ఉస్తాద్ సినిమాలపైనే ఆమె ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమాలతో అయినా ఆమెకు భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

గుంటూరు కారం సంక్రాంతి కానుకగా మరో పది రోజుల్లో విడుదల కానుంది. కానీ ఉస్తాద్ భగత సింగ్ షూటింగ్ మాత్రం ఇంకా హోల్డ్ లో ఉంది. ఏపీ ఎన్నికల తర్వాత షూటింగ్ మొదలు కావచ్చు. కాబట్టి గుంటూరు కారం తర్వాత ఆమెకు ఎక్కువ గ్యాప్ రాకూడదంటే కొత్త సినిమాలకు ఆమె వెంటనే సైన్ చేయాలి.

కానీ 2023 చివరి నెల వరకు కూడా ఆమె ఒక్క సినిమాకు కూడా ఓకే చెయలేదు. దీంతో ఆమె కొత్త మూవీ ప్రకటన కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. త్వరగా ఓ ముంచి మూవీకి చెప్పమ్మా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి చూడాలి శ్రీలీల ఏం చేస్తుందో.