Begin typing your search above and press return to search.

ప్రతీ హీరో కోరిక.. శ్రీలీలతో ఒక స్టెప్పు

ఇప్పుడు ఈ సాంగ్ ని ప్రమోట్ చేయడానికి శ్రీలీల, శేఖర్ మాస్టర్ ముందుకు వచ్చారు.

By:  Tupaki Desk   |   9 Aug 2023 8:51 AM GMT
ప్రతీ హీరో కోరిక.. శ్రీలీలతో ఒక స్టెప్పు
X

టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా వినిపించేది శ్రీలీల పేరే. చాలా మంది హీరోలు తమ సినిమాలు ప్రకటిస్తున్నారు. అయితే, అన్ని సినిమాల్లోనూ కామన్ గా వినిపిస్తున్న పేరు మాత్రం శ్రీలీల. అందరు హీరోలు తమ పక్కన హీరోయిన్ గా శ్రీలీలే ఉండాలని అనుకుంటున్నారు. అందుకే, స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు అన్ని సినిమాల్లోనూ ఆమె నటిస్తోంది.

ఆమె చేతిలో దాదాపు ఇప్పుడు పదికి పైగా సినిమాలు ఉండటం విశేషం. అందరూ హీరోలు తమ సినిమాల్లో శ్రీలీలే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో, ఆమె తన బిజీ షెడ్యూల్ తో అన్ని సినిమాల్లోనూ నటిస్తూ, అదరగొడుతోంది. కేవలం శ్రీలల కాల్షీట్స్ కారణంగానే ఆలస్యమౌతున్న సినిమాలు కూడా ఉన్నాయి. దీనిని బట్టి ఆమె డిమాండ్ ఎలా ఉందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.అయితే, ఆమెకు అంత క్రేజ్ ఉండటానికి ఆమె డ్యాన్స్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.

శ్రీలీల డ్యాన్స్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఎంత కష్టమైన స్టెప్ అయినా, సులభంగా వేసేస్తుంది. ఆమెతో కలిసి డ్యాన్స్ వేయడం అంత సులభం కాదు. అయితే, డ్యాన్స్ వచ్చినవారితోనే వేస్తేనే కదా మజా వచ్చేది అందుకే, చాలా మంది హీరోలు శ్రీలలతో ఒక్క స్టెప్ అయినా వేయాలని అనుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, శ్రీలీల ప్రస్తుతం నితిన్ తో కలిసి ఎక్స్ ట్రా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీని నితిన్ తన సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ మూవీ నుంచి తాజాగా ఓ పాటను విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా 'డేంజర్ పిల్లా పిల్లా' అనే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కాగా ఈ మూవీలో ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

ఇప్పుడు ఈ సాంగ్ ని ప్రమోట్ చేయడానికి శ్రీలీల, శేఖర్ మాస్టర్ ముందుకు వచ్చారు. ఈ పాటను సూపర్ గా ఎవరైనా రీల్స్ చేయండి అంటూ ఆఫర్ ఇచ్చారు. ఈ సాంగ్ రీల్ సూపర్ గా చేస్తే, ఆ వీడియోని ఆదిత్య మ్యూజిక్ అఫీషియల్ లో షేర్ చేస్తామని చెప్పారు. అయితే, రీల్ చేసిన తర్వాత డేంజర్ పిల్లా కాంటెస్ట్ అంటూ ట్యాగ్ చేయమని చెప్పారు. దానితో పాటు శేఖర్ మాస్టర్ తో కలిసి శ్రీలీల డ్యాన్స్ వేస్తున్న వీడియోని షేర్ చేశారు.