Begin typing your search above and press return to search.

స్టార్ హీరోకి శ్రీ లీల షాక్..!

అయితే లేటెస్ట్ గా ఒక ప్రాజెక్ట్ కు మాత్రం శ్రీ లీల నో చెప్పినట్టు టాక్. పెద్ద ప్రొడక్షన్, స్టార్ హీరో సినిమాలో శ్రీ లీల ని హీరోయిన్ గా అనుకున్నారు

By:  Tupaki Desk   |   9 Sep 2023 5:59 AM GMT
స్టార్ హీరోకి శ్రీ లీల షాక్..!
X

టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒక్కటే ఆమె శ్రీలీల. పెళ్లిసందడి, ధమాకా చేసిన రెండు సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు ఓ పక్క స్టార్స్ తో జత కడుతూ మరోపక్క యువ హీరోలతో రొమాన్స్ చేస్తుంది. 3 సినిమాల అనుభవం ఉన్న వైష్ణవ్ తేజ్ నుంచి 30 సినిమాలు చేసిన మహేష్, పవన్ సినిమాల్లో కూడా అమ్మడు నటిస్తుంది. రాం తో స్కంద, బాలకృష్ణ భగవంత్ కేసరి, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ గుంటూరు కారం, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా చేస్తుంది శ్రీ లీల. ఈ సినిమాలన్నీ వరుసగా రిలీజ్ అవుతున్నాయి.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ప్రకారం క్రేజ్ ఉన్న ఈ టైం లోనే తనకు వచ్చిన ప్రతి ఆఫర్ చేస్తూ వెళ్తుంది శ్రీ లీల. పెద్ద బ్యానర్ అయితే చాలు కథతో సంబంధం లేకుండా సినిమా ఓకే అనేస్తుందట.

అయితే లేటెస్ట్ గా ఒక ప్రాజెక్ట్ కు మాత్రం శ్రీ లీల నో చెప్పినట్టు టాక్. పెద్ద ప్రొడక్షన్, స్టార్ హీరో సినిమాలో శ్రీ లీల ని హీరోయిన్ గా అనుకున్నారు. ఫస్ట్ ఆ సినిమా చేస్తానని చెప్పిన శ్రీ లీల ఇప్పుడు నో అనేస్తుందట.

శ్రీ లీలనే తమ హీరోయిన్ అని ఫిక్స్ అయిన ఆ మూవీ యూనిట్ కి అమ్మడు షాక్ ఇచ్చిందట. ఆ హీరోతో నటించడం ఇష్టం లేకనో లేక కథ నచ్చకనో కానీ తన డేట్స్ అడ్జెస్ట్ అవ్వట్లేదని చిన్నగా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసిందట శ్రీ లీల. ఆ సినిమా నుంచి శ్రీ లీల దాదాపు ఎగ్జిట్ అయినట్టే అని చెప్పుకుంటున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ఆమెను తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

శ్రీ లీల నిజంగానే డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఆ సినిమా నుంచి బయటకు వస్తుందా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అన్నది తెలియాల్సి ఉంది. దసరాతో మొదలు పెట్టి సంక్రాంతి వరకు వరుస సినిమాలతో ఆడియన్స్ ని అలరించనున్న శ్రీ లీల ఇప్పటివరకు ఏ సినిమాను కాదని చెప్పలేదు. మరి ఈ సినిమా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నది బయటకు రావాల్సి ఉంది. శ్రీ లీల కాదన్న సినిమా ఏంటి అన్నది త్వరలో తెలుస్తుంది.