Begin typing your search above and press return to search.

శ్రీలీల.. పాన్ ఇండియా ఆఫర్ రిజెక్ట్?

ఇలాంటి టైం లో ఐటెం సాంగ్స్ చేస్తే కెరియర్ కి ఎఫెక్ట్ అవుతుందని భావించి ఆమె వెనక్కి తగ్గిందంట.

By:  Tupaki Desk   |   27 July 2023 12:34 PM GMT
శ్రీలీల.. పాన్ ఇండియా ఆఫర్ రిజెక్ట్?
X

టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతోన్న అందాల భామ శ్రీలీల. ఈ అమ్మడు ఓ వైపు గుంటూరు కారం లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీ గా నటిస్తోంది. మరో వైపు ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ తో జతకట్టింది. అలాగే నితిన్, రామ్ పోతినేనికి జంటగా కనిపించబోతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి లో ఏకంగా పది చిత్రాల వరకు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద ప్రొడక్షన్ హౌస్ ల నుంచి రాబోతున్నవి కావడం విశేషం.

ఇప్పటి వరకు అయితే శ్రీలీల రెండు సినిమా లతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వాటిలో పెళ్ళిసందడి డిజాస్టర్ అయ్యింది. రవితేజ ధమాకా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయితే శ్రీలీల ప్రస్తుతం టాప్ హీరోయిన్స్ అందరిని వెనక్కి నెట్టి మోస్ట్ క్రేజియస్ట్ యాక్టర్ గా ఉంది. యంగ్ హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ కూడా ఆమె వెంట పడుతున్నారు. తాజాగా మరో క్రేజీ ఆఫర్ ని శ్రీలీల వదులుకుందని టాక్.

అది కూడా అల్లు అర్జున్ సినిమా లో రీసెంట్ గా బన్నీతో ఆహా ఒటీటీ యాడ్ లో శ్రీలీల కనిపించింది. ఈ యాడ్ లో బన్నీ, శ్రీలీల పెయిర్ భాగా ఆకట్టుకుంది. దీని ని దృష్టిలో ఉంచుకొని పుష్ప 2లో ఐటెం సాంగ్ కోసం శ్రీలీల ని సుకుమార్ సంప్రదించారంట. మొదటిభాగం లో సమంత చేసిన సాంగ్ కంటే బెస్ట్ పుష్ప 2లో డిజైన్ చేస్తున్నారంట. దానికోసం స్టార్ హీరోయిన్ ని పరిశీలుస్తున్నారు.

ఈ నేపథ్యంలో శ్రీలీల ని సుకుమార్ సంప్రదించడం జరిగిందంట. అయితే ఆమె మాత్రం మొహమాటం లేకుండా నో చెప్పేసిందని టాక్. ప్రస్తుతం తన ఫోకస్ అంతా కూడా హీరోయిన్ పాత్రలమీదనే ఉందని చెప్పిందంట. ఆమెని ఒప్పించే ప్రయత్నం చేసిన చేయనని చెప్పిందని ఇండస్ట్రీ వర్గాల మాట. ఇలాంటి టైం లో ఐటెం సాంగ్స్ చేస్తే కెరియర్ కి ఎఫెక్ట్ అవుతుందని భావించి ఆమె వెనక్కి తగ్గిందంట.

దీంతో పుష్ప 2 మూవీ లో నటించే ఛాన్స్ ని శ్రీలీల మిస్ చేసుకుందని అంటున్నారు. అయితే ఆమె నిర్ణయాన్ని చాలా మంది సమర్ధిస్తున్నారంట. కచ్చితంగా ఐటెం సాంగ్స్ చేస్తే తరువాత హీరోయిన్ గా పాత్రలు రావడం కష్టం అని అంటున్నారు.