Begin typing your search above and press return to search.

చ‌లాకీ గాళ్ శ్రీలీల ప‌క్క‌న అవ్వ‌లా ఆ బ్యూటీ!

ఇది ఓ పాట‌కి సంబంధించి చిత్రీక‌ర‌ణ జ‌రుగు తోన్న స‌మ‌యంలో తీసిన ఫోటో లా ఉంది. ఆ పాట‌కి శేఖ‌ర్ మాస్ట‌ర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 Jan 2024 3:30 PM GMT
చ‌లాకీ గాళ్ శ్రీలీల ప‌క్క‌న అవ్వ‌లా ఆ బ్యూటీ!
X

చ‌లాకీ గాళ్ శ్రీలీల యాక్టివ్ నెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ర‌ష్మిక మంద‌న్న త‌ర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న న‌టి ఆమె. కుర్రాళ్ల‌ని ఎలా ఆక‌ర్షించాలో? ఆమెకే కొన్ని ప్ర‌త్యేక‌మైన టెక్నిక్ లు తెలుసు అనిపిస్తుంది. ఆన్ సెట్స్ అయినా ..ఆఫ్ ది సెట్ అయినా ఒకేలా ఉంటుంది. ఇక వ్య‌క్తిగ‌తంగానూ శ్రీలీల ఎంతో స‌ర‌దాగా ఉంటుంద‌ని కోస్టార్స్ చెబుతుంటారు. త‌న‌మ‌న‌..చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంద‌రితో ఎంతో స‌ర‌దాగా మెలుగుతుంటుంది.


త‌న‌లో ఆ ర‌క‌మైన క్వాలిటీ కూడా తెలుగు ఆడియ‌న్స్ కి మ‌రింత ద‌గ్గ‌ర చేసింద‌నొచ్చు. తాజాగా గుంటూరు కారం ఆన్ సెట్స్ నుంచి ఓ వ‌ర్కింగ్ స్టిల్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. అందులో శ్రీలీల‌-పూర్ణ క‌లిసి ఓ సెల్పీ దిగిన‌ట్లు తెలుస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య ఓ బాబు కూడా ఉన్నాడు. ఇది ఓ పాట‌కి సంబంధించి చిత్రీక‌ర‌ణ జ‌రుగు తోన్న స‌మ‌యంలో తీసిన ఫోటో లా ఉంది. ఆ పాట‌కి శేఖ‌ర్ మాస్ట‌ర్ కోరియోగ్రఫీ చేస్తున్నారు.


ఆ పాట‌ల‌తో శ్రీలీల‌తో పాటు పూర్ణ కూడా భాగ‌మైన‌ట్లు తెలుస్తోంది. పూర్ణ ముస‌లి అవ్వ గెట‌ప్ లో క‌నిపి స్తుంది. నెరిసిన జుట్టు..నుదిటిన కుంకుమ ..రూపాయి బిళ్లంతా స్టిక‌ర్.. చెవికి క‌మ్మ‌లు...ముక్కుకు దిద్దు చూస్తుంటే అచ్చంగా అవ్వ‌నే త‌ల‌పిస్తుంది. ఇక శ్రీలీల మాత్రం హాట్ గా ముస్తాబైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు.


ఈ సంద‌ర్భంగా శేఖ‌ర్ మాస్ట‌ర్ తో త‌న‌కున్న స్నేహం గురించి పూర్ణ చెప్పుకొచ్చింది. ఇద్ద‌రు టీవీలో కొన్ని షోలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆ ర‌కంగా ఇద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహం ఏర్ప‌డింది. త్రివిక్ర‌మ్ కార‌ణంగా సినిమాలో అవ‌కాశం రావ‌డంతో సంతోషం వ్య‌క్తం చేసింది. గుంటూరు కారం సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే.