Begin typing your search above and press return to search.

శ్రీలీల.. ఇంత కష్టం వెనుక కారణమేమిటి?

కానీ శ్రీలీల మాత్రం తన ఫుల్ బిజీ. షెడ్యూల్​లోనూ భగవంత్ కేసరికి సంబంధించి ప్రతీ ఈవెంట్​లోనూ పాల్గొంటూ ఆసక్తికర విషయాలను చెబుతోంది.

By:  Tupaki Desk   |   30 Oct 2023 4:15 PM GMT
శ్రీలీల.. ఇంత కష్టం వెనుక కారణమేమిటి?
X

సాధారణంగా తమ సినిమా ప్రమోషన్స్​లో​ పాల్గొనే విషయంలో ఒక్కో హీరోయిన్​ ఒక్కోలా ప్రవర్తిస్తుంటుంది. ఒక హీరోయిన్​ కేవలం ఏదో ఒక్క ప్రమోషనల్ ఈవెంట్​కు మాత్రమే హాజరై సందడి చేస్తే.. మరో హీరోయిన్​ కంటిన్యూస్​గా ఓ మూడు నాలుగు రోజుల పాటు ప్రమోషన్స్​కు వచ్చి ప్రేక్షకుల్ని పలకరించి వెళ్లిపోతుంది. లేదంటే వరుస ఇంటర్వ్యూలు ఇచ్చేసి తమ ఇతర సినిమా షూటింగ్​ల కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు.

కానీ ప్రస్తుతం యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల అలా చేయలేదు. భగవంత్ కేసరి విషయంలో ఆమె గత నెల నుంచి నాన్​ స్టాప్ ప్రమోషన్స్​ చేస్తూనే ఉంది. సినిమా విడుదలై బ్లాక్ బాస్టర్ అందుకున్న ఇంకా ఆ చిత్ర ప్రమోషన్స్​లో పాల్గొంటూనే ఉంది. అదే సమయంలో చిత్రంలో నటించిన మరో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం సినిమాలు విడుదలకు ముందు, తర్వాత ఓ రెండు మూడు ఈవెంట్లలో పాల్గొని వెళ్లిపోయింది.

కానీ శ్రీలీల మాత్రం తన ఫుల్ బిజీ. షెడ్యూల్​లోనూ భగవంత్ కేసరికి సంబంధించి ప్రతీ ఈవెంట్​లోనూ పాల్గొంటూ ఆసక్తికర విషయాలను చెబుతోంది. దీంతో సినీ ప్రియులకు రకరకాల ప్రశ్నలు మదిలో మెదులుతున్నాయి. ఆమె ఎందుకు నాన్​ స్టాప్​గా ప్రమోషన్స్​లో పాల్గొంటోందని అనుకుంటున్నారు. అయితే దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

మొదటి ఆమె గ్లామర్​, డ్యాన్స్​లు వంటివి కాకుండా మనసును తాకేలా ఓ సోషల్ మెసేజ్ ఇచ్చే పాత్రలో నటించింది. నటనకు ఎక్కువగా ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషించింది. ప్రమోషన్స్​లో ఎక్కువ పాల్గొనడం వల్ల ఆమె పాత్ర మరింత ఎక్కువ మందికి చేరువై తనలోనే టాలెంట్​ మరింత మందికి తెలుస్తుంది.

అలానే నందమూరి నటసింహం బాలకృష్ణ పర్సనల్ రీజన్స్ వల్ల ఎక్కువగా ప్రమోషన్స్​లో పాల్గొనలేకపోతున్నారు. సినిమాలో బాలయ్య తర్వాత మెయిన్ ఫేస్​ శ్రీలీలదే. దీంతో ఈ ముద్దుగుమ్మ.. సినిమాకు సంబంధించి పూర్తి బాధ్యతను తన భుజాలపై వేసుకుని దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి వరుసగా ఈవెంట్లలో పాల్గొంటోంది. అంత బిజీ షెడ్యూల్​, షూట్స్​ ఉన్నప్పటికీ భగవంత్ కేసరి కోసం తన సమయాన్ని కేటాయిస్తోంది.