Begin typing your search above and press return to search.

కుర్చీ అక్క‌డ మ‌డ‌త‌పెట్ట‌మంటే నోవే అనేసిందా!

`గుంటూరు కారం` త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా క‌మిట్ అవ్వ‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` లో న‌టిస్తోంది.

By:  Tupaki Desk   |   24 May 2024 7:30 AM GMT
కుర్చీ అక్క‌డ మ‌డ‌త‌పెట్ట‌మంటే నోవే అనేసిందా!
X

శ్రీలీల ఎంత గొప్ప డాన్స‌ర్ అన్న‌ది చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టిగా కంటే అమ్మ‌డు ఎక్కువ‌గా పాపుల‌ర్ అయింది డాన్స్ నెంబ‌ర్ల‌తోనే. `గుంటూరు కారం`లో కుర్చీ ని ఏ రేంజ్ లో మ‌డ‌త పెట్టిందో తెలిసిందే. ఈ పాట త‌ర్వాత మ‌రింత పాపుల‌ర్ అయింది. శ్రీలీల క్రేజ్ అంత‌కంత‌కు రెట్టింపు అయింది. కానీ హీరోయిన్ గా అవ‌కాశాలు అందుకోవ‌డంలో మాత్రం వెనుక‌బ‌డే ఉంది. మ‌రి శ్రీలీల‌కి ఏ కార‌ణంగా అవ‌కాశాలు రావ‌డం లేద‌న్న‌ది అర్దం కాని ప్ర‌శ్న‌.

`గుంటూరు కారం` త‌ర్వాత ఇంత‌వ‌ర‌కూ కొత్త సినిమా క‌మిట్ అవ్వ‌లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో `ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్` లో న‌టిస్తోంది. కానీ అది డిలే అవుతోన్న ప్రాజెక్ట్ . కాబ‌ట్టి ప్ర‌స్తుతానికి ఆ సినిమా చ‌ర్చ అన‌వ‌స‌ర‌మైన‌దే. అయితే ఇటీవ‌లే అమ్మ‌డు త‌ల‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న `గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` లో ఓ ఐటం నెంబ‌ర్కి ఒకే చెప్పిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. `గుంటూరు కారం`లో అమ్మ‌డి కుర్చీ పెర్పార్మెన్స్ చూసి ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భుని అమెని ఐటం గాళ్ల్ గా త‌మ సినిమాకి క‌న్విన్స్ చేసిన‌ట్లు నెట్టింట ప్ర‌చారం సాగింది.

దీంతో ఐటం నెంబ‌ర్ తో శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖ‌రారైంది అంతా భావించారు. కానీ అమ్మడు అందుకు ఒప్పుకోలేదుట‌. అవ‌కాశం వ‌చ్చిన మాట వాస్త‌వ‌మే అంటున్నారు కానీ ఐటం పాట‌తో అక్క‌డ ఎంట్రీ ఇవ్వ‌డం త‌నకి ఎంత మాత్రం ఇష్టంలేక ఆఫ‌ర్ ని రిజెక్ట్ చేసిన‌ట్లు తాజాగా జాతీయ మీడియాలో ఓవార్త వైర‌ల్ అవుతోంది. సినిమాలో సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చినా ఒకేగానీ...ఐటం పాట‌లో మాత్రం న‌టించ‌ని క‌రాఖండీగా చెప్పేసిందిట‌.

అయితే ఇంత‌వ‌ర‌కూ రావ‌డానికి ఓ కార‌ణం కూడా వినిపిస్తుంది. తొలుత హీరోయిన్ అనే చిత్ర వ‌ర్గాలు అమెని ఆప్రోచ్ అయ్యాయి అన్న స‌మాచారంతోనే శ్రీలీల ద‌ర్శ‌కుడితో ఫోన్ లో సంప్ర‌దింపులు జ‌రిపిందిట‌. కానీ చివ‌రి నిమిషంలో హీరోయిన్ కాదు...ఐటం భామ అనే స‌రికి వెంట‌నే రిజెక్ట్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఆ ర‌కంగా అమ్మ‌డు కోలీవుడ్ ఛాన్స్ మిస్ అవ్వాల్సిన ప‌రిస్థితి.