Begin typing your search above and press return to search.

శ్రీలీల లక్ ని డిసైడ్ చేసే మూవీస్ ఇవే

నటిగా శ్రీలీలకి మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. దీంతో శ్రీలీల పేరు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 1:30 AM GMT
శ్రీలీల లక్ ని డిసైడ్ చేసే మూవీస్ ఇవే
X

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు సెకండ్ మూవీ ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలు దక్కించుకుంది. అవకాశాలు అయితే వస్తున్నాయి కాని ఆశించిన స్థాయిలో స్పీడ్ కనిపించడం లేదు.

ఈ ఏడాది రీసెంట్ గా స్కంద మూవీ రిలీజ్ అయ్యింది. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ సొంతం చేసుకుంది. ఈ మూవీతో శ్రీలీల ఖాతాలో మరో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. తాజాగా బాలయ్య భగవంత్ కేసరి మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతోంది.

నటిగా శ్రీలీలకి మంచి మార్కులు పడ్డాయి. విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. దీంతో శ్రీలీల పేరు ఇప్పుడు టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. నెక్స్ట్ వైష్ణవ్ తేజ్ కి జోడీగా నటించిన ఆదికేశవ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. ప్రమోషన్స్ చేస్తోన్న సినిమా పెద్దగా జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చనే మాట వినిపిస్తోంది.

నితిన్ కి జోడీగా ఎక్స్ ట్రార్డినరి మూవీ చేస్తోంది. ఈ సినిమా కూడా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమా మీద శ్రీలీల చాలా నమ్మకంగా ఉంది. వీటి తర్వాత వచ్చే ఏడాది సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా నటిస్తోన్న గుంటూరు కారం రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ సరసన నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు.

మొత్తానికి ఈ ఏడాది రెండు సినిమాలు శ్రీలీల భవిష్యత్తు ఏంటో తెల్చేశాయి. మరో రెండు సినిమాలు ఆమె స్పీడ్ ఎలా ఉండబోతోందో డిసైడ్ చేయనున్నాయి. గుంటూరు కారం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కావడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ అయితే హెవీగా ఉన్నాయి.