Begin typing your search above and press return to search.

ప్రభాస్​తో శ్రీలీల సినిమా.. దర్శకుడు ఎవరంటే?

అయితే తాజాగా ఆమె మరో చిత్రానికి ఓకే చేసిందని సమాచారం అందుతోంది. శ్రీలల కొత్తగా ఓకే చేసిన ఆ ప్రాజెక్ట్​ ప్రభాస్​ ది కావడం విశేషం.

By:  Tupaki Desk   |   25 Sep 2023 6:21 AM GMT
ప్రభాస్​తో శ్రీలీల సినిమా.. దర్శకుడు ఎవరంటే?
X

అటు సీనియర్ హీరోలు, ఇటు యంగ్ హీరోలు కలిపి ప్రస్తుతం ఏకంగా దాదాపు 9 చిత్రాల్లో నటిస్తున్న సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల. అన్నీ చిత్రాల్లోనూ ఫీమేల్​ లీడ్ రోల్​లో నటిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాలన్నీ వరుసగా రిలీజ్​కు రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఆమె ప్రభాస్ సినిమా కోసం కమిటైనట్లు సమాచారం అందింది.

వివరాళ్లోకి వెళితే.. పెళ్లిసందD చిత్రంతో టాలీవుడ్​కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీల.. తన రెండో చిత్రంలోనే మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించే ఛాన్స్ అందుకుంది. ఈ మూవీ సూపర్ హిట్​ అందుకోవడంతో ఒక్కసారిగా సెన్సేషనల్​ హీరోయిన్​గా మారిపోయింది. ఎందుకంటే ఈ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ యాక్టింగ్​కు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.


దాంతో ఆమెకు వరుస సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. మరో మూడు ఆమె నటించిన రామ్‌ పోతినేని 'స్కంద' రిలీజ్ కానుంది. వచ్చే నెలలో బాలకృష్ణతో కలిసి నటించిన 'భగవంత్ కేసరి' రానుంది. ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్‌తో 'ఆదికేశవ్', నితిన్‌తో 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' సినిమాలతో ప్రేక్షకులను అలరించనుంది.

వచ్చే ఏడాది సూపర్ స్టార్ మహేశ్​ బాబు 'గుంటూరు కారం'తో, విజయ్ దేవరకొండతో ఓ చిత్రంలో, పవన్ కళ్యాణ్ సరసన 'ఉస్తాద్ భగత్ సింగ్'తో అలరించనుంది. అయితే తాజాగా ఆమె మరో చిత్రానికి ఓకే చేసిందని సమాచారం అందుతోంది. శ్రీలల కొత్తగా ఓకే చేసిన ఆ ప్రాజెక్ట్​ ప్రభాస్​ ది కావడం విశేషం.

హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. గతేడాది సీతారామంతో సూపర్​ హిట్​ అందుకున్న హను రాఘవపూడి నుంచి రాబోతున్న రెండో చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నారట. ఇప్పటికే కథా చర్చలు ముగిశాయని సమాచారం.వచ్చే సంవత్సరం మొదట్లో షూటింగ్‌ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం హను ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉన్నారట. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతుందట.