Begin typing your search above and press return to search.

శ్రీలీల.. మరో డౌటా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన మరో ముద్దుగుమ్మ శ్రీలీల. యాక్టింగ్, డ్యాన్స్ లతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ అమ్మడు

By:  Tupaki Desk   |   12 Feb 2024 9:37 AM GMT
శ్రీలీల.. మరో డౌటా?
X

టాలీవుడ్ ఇండస్ట్రీకి దొరికిన మరో ముద్దుగుమ్మ శ్రీలీల. యాక్టింగ్, డ్యాన్స్ లతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ అమ్మడు. వరుస ఆఫర్లను కొల్లగొడుతూ.. కొంత మంది హీరోయిన్లకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. డాక్టర్ చదువుతూనే యాక్టింగ్ చేస్తూ రెండు పడవలపై కూడా నెగ్గుకు రావచ్చునని ప్రూవ్ చేసింది. కన్నడ నుంచి టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. పెళ్లి సందDతో మెప్పించింది.

రవితేజ ధమాకా చిత్రంతో స్టార్ డమ్ తెచ్చుకున్న ఆమెకు వరుస ఛాన్సులు క్యూ కట్టాయి. నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో పాటు రామ్ వంటి యంగ్ స్టార్స్‌ తో యాక్ట్ చేసింది ఈ భామ. అటు యాడ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌ కు వెళ్తూ మంచిగా సంపాదిస్తోంది. ఇటీవలే ఓ బెట్టింగ్ యాడ్ కు నో చెప్పి.. టాలీవుడ్ సినీ ప్రియులతో ప్రశంసలు అందుకుంది. గ్రేట్ యాక్ట్రెస్ అంటూ పొగడ్తలు అందుకుంది.

గతేడాది స్కంద, భగవంత్ కేసరి, ఆది కేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ అమ్మడు.. ఈ సంక్రాంతికి గుంటూరు కారంలో మహేశ్ తో జతకట్టింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే చేస్తోంది. ఆమె చేతిలో ఇంకా ఏ సినిమాలు లేవు. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది.

ఎంబీబీఎస్ పరీక్షలు ఉండటంతో ఆమె మరో సినిమా ఒప్పుకోవడం లేదని, ఎగ్జామ్స్ అయ్యాక కొత్త కథలు విని గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అందుకే కొత్త కథలు వినడం లేదని టాక్ నడుస్తోంది. కానీ అది నిజం కాదని.. శ్రీలీల రెమ్యునరేషన్ కారణంగానే ఆమెకు ఛాన్సులు రావడం లేదని కొందరు చెబుతున్నారు. ఇటీవలే ఆమె నటించిన గుంటూరు కారం మూవీకి రూ.4 కోట్లు తీసుకుందట ఈ అమ్మడు.

అందుకే ఇతర నిర్మాతలెవరూ ఆమెను సంప్రదించడం లేదట. శ్రీలీల కూడా పారితోషకం విషయంలో అస్సలు తగ్గడం లేదట. ఓసారి రెమ్యునరేషన్ విషయంలో ఈ బ్యూటీ ఆలోచించుకోవాలని సినీ పండితులు సూచిస్తున్నారు. మరోవైపు, టాలీవుడ్ లో లాంగ్ టైమ్ హీరోయిన్ గా కొనసాగాలంటే మాత్రం శ్రీలీల సరైన డబ్బింగ్ ఆర్టిస్ట్ తో కలిసి పనిచేయాలని సజ్జెస్ట్ చేస్తున్నారు. కొన్నేళ్లపాటు సమంతకు చిన్మయి డబ్బింగ్ చెప్పిన విషయాన్ని ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. మరి ఈ రెండు విషయాల్లో శ్రీలీల ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి?