Begin typing your search above and press return to search.

అయ్యో శ్రీలీల.. మళ్లీనా?

గత ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు శ్రీలీల రాగా.. అందులో మూడు చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి.

By:  Tupaki Desk   |   16 April 2024 2:30 PM GMT
అయ్యో శ్రీలీల.. మళ్లీనా?
X

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైమ్ లోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది యంగ్ బ్యూటీ శ్రీలీల. పెళ్లి సందడి మూవీతో కుర్రాళ్ల మనసులు దోచుకుంది ఈ బ్యూటీ. ఆ తర్వాత రవితేజతో చేసిన ధమాకా మూవీ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు అందుకుంది. టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిపోయింది. కానీ కొద్దిరోజులుగా శ్రీలీలకు లక్ సరిగ్గా కలిసి రావడం లేదనే చెప్పాలి.


గత ఏడాది నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు శ్రీలీల రాగా.. అందులో మూడు చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. భగవంత్ కేసరి మాత్రమే హిట్ అయింది. 2024లో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో థియేటర్లలోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా.. మిక్స్ డ్ టాక్ అందుకుంది. దీంతో సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి స్టడీస్ పై ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయిందట శ్రీలీల.

ఈ నేపథ్యంలో పలు భారీ సినిమాల ఆఫర్లు వచ్చినా శ్రీలీల రిజెక్ట్ చేసిందని వార్తలు వచ్చాయి. కొన్ని నెలలుగా కొత్తగా ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. విజయ్ దేవరకొండ మూవీ నుంచి ఆమెనే తప్పుకుంది. అయితే యంగ్ హీరో నితిన్.. రాబిన్ హుడ్ మూవీలో శ్రీలీలనే హీరోయిన్ గా నటిస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.

ఎక్స్ ట్రా ఆర్డినరీ సినిమా టైమ్ లో కూడా నితిన్.. శ్రీలీలతో మరో మూవీ చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు రాబిన్ హుడ్ నుంచి ఆమెను తప్పించినట్లు టాక్ వినిపిస్తోంది. శ్రీలీలను రాశీ ఖన్నాతో రీప్లేస్ చేసినట్లు తెలుస్తోంది. ముందు ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా రష్మిక మందన్న అనుకున్నారు. ఆమె తప్పుకోవడంతో శ్రీలీలను సెలెక్ట్ చేశారట. ఇప్పుడు ఈమెను తప్పించి రాశిని ఎంచుకున్నట్లు సమాచారం.

కానీ కొందరు ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించనుందని, రాశి కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇస్తేనే అసలు విషయం తెలుస్తుంది. ఇప్పటికే రాశీ ఖన్నా, నితిన్ శ్రీనివాస కళ్యాణం మూవీలో నటించగా.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. మరి రాబిన్ హుడ్ సినిమా విషయంలో వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి.