Begin typing your search above and press return to search.

శ్రీలీల పరిస్థితి ఏంటి..?

రికార్డు స్థాయి పారితోషికం తీసుకుంటూ వరుస సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీలీలకి ఇటీవల అన్ని నిరాశ పరచుతూ వచ్చాయి.

By:  Tupaki Desk   |   20 Feb 2024 7:14 AM GMT
శ్రీలీల పరిస్థితి ఏంటి..?
X

తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా స్టార్‌ డమ్‌ దక్కించుకోవడం కష్టం అనుకుంటున్న సమయంలో తెలుగు మూలాలు ఉన్న ముద్దుగుమ్మ శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. రాఘవేంద్ర రావు ఎంపిక అవ్వడంతో శ్రీలీలకు అనూహ్యంగా స్టార్ డమ్ దక్కింది.

రాఘవేంద్ర రావు హీరోయిన్ అంటూ శ్రీలీలకు పేరు దక్కడంతో మొదటి సినిమా నిరాశ పరిచినా కూడా బ్యాక్ టు బ్యాక్‌ ఆఫర్లు వచ్చాయి. ధమాకా సినిమా హిట్ అవ్వడంతో శ్రీలీల మరింత స్పీడ్ పెంచింది. హీరోయిన్ గా శ్రీలీలకు పోటీ ఎవరు లేరు అన్నట్లుగా ఒకే సారి అయిదు ఆరు సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది.

రికార్డు స్థాయి పారితోషికం తీసుకుంటూ వరుస సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీలీలకి ఇటీవల అన్ని నిరాశ పరచుతూ వచ్చాయి. భగవంత్ కేసరి మినహా మిగిలిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడం తో శ్రీలీల కెరీర్ సందిగ్దంలో పడ్డట్టు అయ్యింది.

అసలు శ్రీలీల చేతిలో ప్రస్తుతం సినిమాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పవన్‌ కళ్యాణ్ సినిమా ఉస్తాద్‌ భగత్ సింగ్ లో శ్రీలీల ఎంపిక అయ్యిందనే వార్తలు వచ్చాయి. అయితే ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఎప్పటికీ ప్రారంభం అయ్యేది తెలియదు.

ఇక నితిన్ తో రాబిన్ హుడ్‌ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆ సినిమా పై క్లారిటీ లేదు. విజయ్ దేవరకొండ తో శ్రీలీల ఒక సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలు మినహా శ్రీలీల తెలుగు లో పెద్దగా చేస్తున్నది లేదు.

తమిళ సినిమాల్లో కూడా శ్రీలీల నటిస్తున్నట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ వాటిపై క్లారిటీ లేదు. శ్రీలీల హీరోయిన్ గా మళ్లీ జోరు అందుకుంటుందా అనేది చూడాలి.