Begin typing your search above and press return to search.

ఇలా చూసుకుంటే శ్రీలీలకు మంచి లాభమే..

సంక్రాంతికి రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   14 Feb 2024 3:30 PM GMT
ఇలా చూసుకుంటే శ్రీలీలకు మంచి లాభమే..
X

సంక్రాంతికి రిలీజ్ అయిన సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమా థియేటర్స్ లో ఏవరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే మూవీలో కుర్చీ పడతపెట్టి సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. అందులో డాన్స్ బీట్స్ కూడా సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో కస్టపడి డాన్స్ బీట్స్ ఎక్కువగా చేసిన మూవీ గుంటూరు కారం అని చెప్పాలి.

కావాలని కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీలీలతో పోటీపడి డాన్స్ చేయడానికి మహేష్ బాబు ఈ చిత్రంలో ప్రయత్నం చేశారు. ఆమె డాన్స్ టాలెంట్ గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ లో మహేష్ బాబు ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసలు కురిపించారు. ఈ మూవీలో రెండు సార్లు శ్రీలీల తన డాన్స్ టాలెంట్ ని చూపిస్తుంది.

ఇటీవల ఈ మూవీ ఓటీటీలో ఐదు భాషలలో రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో ప్రస్తుతం గుంటూరు కారం మూవీ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. దానికి కారణం శ్రీలీల డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా. అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ కి మూవీ కనెక్ట్ అయ్యింది. ఆదికేశవ, స్కంద, ఎక్స్ట్రార్డినరీ మెన్ సినిమాలతో మూడు డిజాస్టర్ లు గత ఏడాది ఆమె ఖాతాలో చేరాయి.

భగవంత్ కేసరి హిట్ అయిన శ్రీలీలకి యాక్టింగ్ పరంగా ఆ మూవీ పేరు తీసుకొచ్చింది. అయితే గుంటూరు కారం సినిమా ఏవరేజ్ అయిన కూడా శ్రీలీల క్రేజ్ అమాంతం పెంచేసిందని చెప్పాలి. ఇప్పటికే టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా నెంబర్ వన్ చైర్ వైపు ఈ బ్యూటీ దూసుకుపోతోంది. గుంటూరు కారం సినిమా ఇప్పుడు ఇతర భాషలలో కూడా ఆమె క్రేజ్ ఇమేజ్ ని పెంచేసింది.

ఫ్యూచర్ లో తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా శ్రీలీల స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి ఉంది. అలాగే రెండు, మూడు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. గౌతమ్ తిన్ననూరి, విజయ్ దేవరకొండ మూవీలో శ్రీలీల హీరోయిన్ కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయితేనే ఈమె ఉందో లేదో అనేది తెలుస్తుంది.