Begin typing your search above and press return to search.

శ్రీలీల.. మహేష్ సినిమా అయినా టెన్షనే?

ఈ ఏడాదిలో ఇప్పటి వరకు శ్రీలీల నటించిన మూడు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి.

By:  Tupaki Desk   |   29 Nov 2023 6:12 AM GMT
శ్రీలీల.. మహేష్ సినిమా అయినా టెన్షనే?
X

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా శ్రీలీల దూసుకుపోతోంది. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తోంది. అయితే ఆమెని కరెక్ట్ గా రిప్రజెంట్ చేసే సినిమాలు మాత్రం రావడం లేదని చెప్పాలి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు శ్రీలీల నటించిన మూడు సినిమాలు థియేటర్స్ లోకి వచ్చాయి. వాటిలో ఒక్క భగవంత్ కేసరి మాత్రమే మంచి పాత్ర దొరికింది.

రామ్ పోతినేని స్కంద, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమాలో శ్రీలీల పాత్రలు కేవలం రెండు సీన్స్, రెండు పాటలకి అనేలా ఉన్నాయి. పెర్ఫార్మెన్స్ కి అస్సలు స్కోప్ లేదు. ఏదో అలా వచ్చిపోతుంది. ఈ సినిమాలు కూడా డిజాస్టర్ అవ్వడంతో శ్రీలీల ఇమేజ్ కి ఏ విధంగా కూడా ఈ సినిమాలు ప్లస్ కాలేదు. డిసెంబర్ లో నితిన్ కి జోడీగా ఎక్స్ట్రార్డినరీ సినిమాతో ఈ బ్యూటీ మరల ప్రేక్షకుల ముందుకి వస్తోంది.

తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో శ్రీలీలకి పెద్దగా ఎలివేషన్ దొరకలేదు. సినిమాలో కూడా ఆమె పాత్ర అలాగే ఉండబోతోందనే టాక్ ఇండస్ట్రీ సర్కిల్ లో వినిపిస్తోంది. ఇప్పుడు గుంటూరు కారం సినిమా విషయంలో కూడా శ్రీలీల ఫ్యాన్స్ కి అదే టెన్షన్ ఉంది. త్రివిక్రమ్ సినిమాలలో ఇద్దరు హీరోయిన్స్ కామన్ గా ఉంటారు. అయితే ఒక హీరోయిన్ పాత్ర మాత్రం ఏదో నామమాత్రంగా అనేట్లు ఉంటుంది.

అల వైకుంఠపురంలో నివేతా పెతురాజ్, జనతా గ్యారేజ్ లో ఈషారెబ్బా పాత్రలు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే తక్కువ ప్రాధాన్యత ఉంటాయి. గుంటూరు కారం సినిమాలో కూడా శ్రీలీలకి అలాంటి పాత్ర ఇస్తే ఆమె కెరియర్ కి ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. అలా కాకుండా కాస్తా పవర్ ఉన్న పూజా హెగ్డే చేసిన తరహాలో రోల్స్ ఇస్తే మాత్రం ఇమేజ్ కి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.

గుంటూరు కారం సినిమాలో కూడా శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్ గా ఉంది. వీరిద్దరిలో ఎవరి పాత్రకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది మూవీ రిలీజ్ తర్వాత గాని తెలియదు. కచ్చితంగా ఒక రోల్ మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహాలో ఉండే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం నడుస్తోంది.