Begin typing your search above and press return to search.

శ్రీలీల స్టన్నింగ్.. ట్రాఫిక్ లో ఇలా..

తాజాగా ఓ ఇంటరెస్టింగ్ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫుల్ ట్రాఫిక్ లో చిక్కుకొని కారులో అమ్మతో ఫోటో తీసుకోవడానికి ట్రై చేస్తే ఆమె ఇష్టపడలేదు.

By:  Tupaki Desk   |   17 March 2024 4:18 AM GMT
శ్రీలీల స్టన్నింగ్.. ట్రాఫిక్ లో ఇలా..
X

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. వరుసగా స్టార్ హీరోలతో జత కడుతూ సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది గుంటూరు కారం మూవీతో పరవాలేదు అనిపించేలా ఒక కమర్షియల్ రిజల్ట్ ని ఆమె ఖాతాలో వేసుకుంది. గత ఏడాది భగవంత్ కేసరి సినిమాలో బాలయ్యతో మంచి పాత్రలో కనిపించి పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది.

చాలా కాలం తర్వాత ఒక తెలుగమ్మాయి స్టార్ హీరోయిన్ రేసులోకి అది కూడా తెలుగు సినిమాలతో వస్తూ ఉండటం విశేషమని చెప్పాలి. యాక్టర్ గా పెర్ఫార్మెన్స్ తో పాటు మంచి డాన్స్ టాలెంట్ ఉండటం కూడా శ్రీలీలకి కలిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మూడు, నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో శ్రీలీల నటిస్తోంది.

తమిళంలోకి కూడా శ్రీలీల ఈ ఏడాది అడుగుపెట్టే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. సోషల్ మీడియాలో శ్రీలీల యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తనకి సంబందించిన అప్డేట్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడు చూసిన యాక్టివ్ గా లవ్ లీ స్మైల్ తో శ్రీలీల అందరిని ఆకట్టుకోవడం విశేషం. ఆమె స్మైల్ అందాన్ని మరింతగా పెంచుతూ ఉంటుందని చెప్పాలి.

తాజాగా ఓ ఇంటరెస్టింగ్ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఫుల్ ట్రాఫిక్ లో చిక్కుకొని కారులో అమ్మతో ఫోటో తీసుకోవడానికి ట్రై చేస్తే ఆమె ఇష్టపడలేదు. అందుకే నేనే సెల్ఫీ తీసుకున్న అంటూ హ్యాపీ పిక్చర్ అని ఫోటోని షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏ సిచువేషన్ లో ఉన్న కూడా అందులో ఆనందం వెతుక్కోవడం శ్రీలీలకి అలవాటు అని ఈ ఫోటోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అలాగే నీ అందంతో నా గుండెను దోచేసావ్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఈ ఫోటోని 3.19 లక్షల మంది నెటిజన్లు లైక్ చేయడం విశేషం. దీనిని బట్టి శ్రీలీలకి ప్రస్తుతం ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు. శ్రీలీల హీరోయిన్ గా సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకుంది ధమాకా చిత్రంతో. ఆ తరువాత వచ్చినవి ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. ఈ ఏడాది అయిన ఈ బ్యూటీకి సూపర్ హిట్స్ రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.