Begin typing your search above and press return to search.

శ్రీ‌లీల ప్రేమ‌లో వీరాభిమాని బ్యాన‌ర్లు వేసి మరీ..!

కానీ ఇప్పుడు వీళ్ల‌కు ధీటుగా శ్రీలీల‌కు కూడా బ్యాన‌ర్లు క‌ట్టి ఆరాధించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఒక తెలుగ‌మ్మాయికి ఇంత పెద్ద స్థాయిలో గౌర‌వం ద‌క్క‌డం అన్న‌ది చాలా అరుదు.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:02 AM GMT
శ్రీ‌లీల ప్రేమ‌లో వీరాభిమాని బ్యాన‌ర్లు వేసి మరీ..!
X

క‌థానాయిక‌ల‌కు బ్యాన‌ర్లు క‌ట్ట‌డం అరుదు. కానీ ఇక్క‌డ ఒక అభిమాని త‌న ఫేవ‌రెట్ హీరోయిన్ బ్యాన‌ర్ క‌ట్టి దానిపై వేయించిన కొటేషన్ చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ బ్యాన‌ర్ పై కొటేష‌న్ చూసాక‌ ఫ‌క్కున న‌వ్వ‌కుండా ఉండ‌లేరు. అత‌డి వీరాభిమానం, పిచ్చి ప్రేమ ఎలాంటివో ఇప్పుడు ఈ బ్యాన‌ర్ చూసిన వారు అర్థం చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 'గుంటూరు కారం' థియేట‌ర్ల ద‌గ్గ‌ర మ‌హేష్ ఫ్లెక్సీలు కటౌట్లు నిల‌బెట్టేందుకు ఎంత ఆస‌క్తిగా ఉన్నారో ఇప్పుడు శ్రీ‌లీల అభిమానులు కూడా త‌న‌ను అంత‌గా ఆరాధిస్తూ ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు క‌ట్ట‌డం చూస్తుంటే ఇది నిజంగానే ఒక ట్రెండ్ అని అంగీక‌రిస్తున్నారు.


అరుంధ‌తి, భాగ‌మ‌తి వంటి నాయికా ప్ర‌ధాన‌ చిత్రాల‌తో అల‌రించిన అనుష్క‌కు, వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో స‌త్తా చాటి గ్లోబ‌ల్ స్టార్ గా ఎదిగేస్తున్న స‌మంత‌కు, త‌లైవిగా పిలుపందుకున్న న‌య‌న‌తార‌కు మాత్ర‌మే గ‌తంలో బ్యాన‌ర్లు క‌ట్టారు. కానీ ఇప్పుడు వీళ్ల‌కు ధీటుగా శ్రీలీల‌కు కూడా బ్యాన‌ర్లు క‌ట్టి ఆరాధించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. ఒక తెలుగ‌మ్మాయికి ఇంత పెద్ద స్థాయిలో గౌర‌వం ద‌క్క‌డం అన్న‌ది చాలా అరుదు. శ్రీ‌లీల కంటే ముందే చాలా మంది తెలుగ‌మ్మాయిలు క‌థానాయిక‌లు అయ్యారు. ఇప్ప‌టికీ తెలుగ‌మ్మాయిలు చాలా మంది పెద్ద తెర‌పై అదృష్టం ప‌రీక్షించుకుంటూనే ఉన్నారు. కానీ కెరీర్ ప్రారంభించిన మూడు సినిమాల‌కే కేవ‌లం నాలుగేళ్ల‌కే ఇంత పెద్ద స్టార్ డ‌మ్ అందుకోవ‌డం ఆషామాషీ కాదు. స్టార్ డ‌మ్ ని మించి వీరాభిమానం త‌న‌కు ద‌క్కింద‌ని చెప్పాలి.

ఇక‌పై శ్రీ‌లీల‌కు కూడా పాలాభిషేకాలు, ర‌క్తాభిషేకాలు కూడా చేస్తారేమో! అన్నంత క్రేజ్ క‌నిపిస్తోంది. గుంటూరు కారం సినిమా రిలీజ్ సందర్భంగా ఓ ఊర్లో శ్రీలీల ఫ్యాన్స్ పెద్ద బ్యానర్ క‌ట్టారు. ఈ బ్యాన‌ర్ పై ఫ్యాన్స్ ఫోటోలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా దీనిపై కొటేష‌న్ ఫ‌క్కున న‌వ్వు పుట్టించింది.''గుంటూరు కారం ఘాటు.. మూవీకి శ్రీలీల స్వీటు.. అందుకే నువ్వు నా హార్ట్..'' అని క‌వితాత్మ‌కంగా రాశారు. శ్రీలీల డై హార్డ్ ఫ్యాన్స్ అని కూడా దీనిపై వేసారు. ఈ బ్యానర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్యాన‌ర్ పై ఫోటోలు కోట్స్ చూసిన వారంతా బావుంద‌య్యా మీ వ్య‌వ‌హారం! అంటూ పొగిడేస్తున్నారు. ముఖ్యంగా శ్రీ‌లీల‌పై అభిమానుల ప్రేమ‌, అభిమానాన్ని కొనియాడుతున్నారు.

గుంటూరు కారంలో మ‌రోసారి శ్రీ‌లీల అద్భుత న‌ట‌న, డ్యాన్సుల‌తో మెరిపించింది. ముఖ్యంగా మ‌హేష్ అంత‌టివాడు త‌న‌తో డ్యాన్సులు చేయ‌డం అంటే ఎంత క‌ష్ట‌మో వేదిక‌ల‌పై మాట్లాడుతున్నారు. కుర్చీ మ‌డ‌త పెట్టి పాట‌కు కూడా శ్రీ‌లీల డ్యాన్సులు అద్భుతం. త‌న కోస‌మే ప్ర‌త్యేకించి డ్యాన్స్ సీక్వెన్సులు క్రియేట్ చేయ‌డం గుంటూరు కారంలో హైలైట్ గా నిలిచింది.