Begin typing your search above and press return to search.

శ్రీలీల చాలా డేంజర్ పిల్ల అంటున్న నితిన్..!

ఈ సినిమా నుంచి తాజాగా 'డేంజర్ పిల్లా పిల్లా' అనే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   2 Aug 2023 12:39 PM GMT
శ్రీలీల చాలా డేంజర్ పిల్ల అంటున్న నితిన్..!
X

యంగ్ హీరో నితిన్ , క్రేజీ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఎక్స్ ట్రా. ఈ మూవీని నితిన్ తన సొంత బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ మూవీ నుంచి తాజాగా ఓ పాటను విడుదల చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా 'డేంజర్ పిల్లా పిల్లా' అనే ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

పాట లొకేషన్స్ చాలా అందంగా ఉన్నాయి. నితిన్, శ్రీలీల జోడి కూడా చూడటానికి బాగుంది. పాట మొత్తం విదేశాల్లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. "అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా .. చీకట్లో తిరగని మిణుగురు తళుకువా" అంటూ పాట సాగింది. హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. ఈ పాటను కృష్ణకాంత్ స్వరపరచగా, అర్మాన్ మాలిక్ అద్భుతంగా పాడాడు.

కాగా ఈ మూవీలో ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. శేఖర్ కొరియోగ్రఫీ ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. దానికి తగినట్లు నితిన్ కూడా డ్యాన్స్ ఇరగదీశాడు.

కాగా, ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా, నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆ సినిమాలో మొదట రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ మూవీ నుంచి తప్పుకోవడం తో ఆ స్థానంలోకి శ్రీలీల ను తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే, వీరి కాంబినేషన్ లో బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు వచ్చినట్లు అవుతాయి.

కాగా, శ్రీలీల హవా కొనసాగుతోంది. రెండు రోజుల క్రితమే రామ్ పోతినేని మూవీ స్కంధ నుంచి ఓ పాట విడుదలైంది. దాంట్లో శ్రీలీల కనపడింది. ఇప్పుడు ఈ పాటలోనూ శ్రీలీలే కనపడుతోంది. ఏ మూవీ నుంచి ఏ పాట విడుదలైనా, హీరో మారుతున్నాడు కానీ, హీరోయిన్ మాత్రం ఆమె కనపడుతోంది. మరి వీటిలో ఆమెకు ఎన్ని హిట్లు ఇస్తాయో చూడాలి.