Begin typing your search above and press return to search.

హీరోయిన్ గా చేయడం కంటే దానిపైనే ఎక్కువ ఆసక్తి...!

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఈ అమ్మడు తన కెరీర్‌ లో దూసుకు పోతుంది. భారీ ఎత్తున ఈ అమ్మడి యొక్క పారితోషికం పెరిగింది

By:  Tupaki Desk   |   17 Nov 2023 6:07 AM GMT
హీరోయిన్ గా చేయడం కంటే దానిపైనే ఎక్కువ ఆసక్తి...!
X

టాలీవుడ్‌ లో ప్రస్తుతం మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ ఎవరు అంటే అందరూ చెప్పే పేరు శ్రీలీల. ఈ అమ్మడు మొదటి సినిమా నిరాశ పరిచినా కూడా అదృష్టం బాగుండటంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. అదృష్టం కి తోడు అందం మరియు ప్రతిభ కూడా ఈమె సొంతం. అందుకే ఇండస్ట్రీలో శ్రీలీల దున్నేస్తోంది.

సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఈ అమ్మడు తన కెరీర్‌ లో దూసుకు పోతుంది. భారీ ఎత్తున ఈ అమ్మడి యొక్క పారితోషికం పెరిగింది. అయినా కూడా నిర్మాతలు ఈమె అడిగినంత ఇచ్చి మరీ తమ సినిమాల్లో బుక్‌ చేస్తున్నారు. హీరోయిన్‌ గా నెం.1 స్థాయిలో ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి కోరుకున్న ఎంబీబీఎస్‌ ని మాత్రం వదలను అంటోంది.

నా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా నేను డాక్టర్‌ అవ్వాలని కోరుకున్నారు. అందుకే నేను ఎంబీబీఎస్ చేస్తున్నాను. చిన్నప్పుడే నా మనసులో డాక్టర్ అవ్వాలని పడింది. అందుకే హీరోయిన్‌ గా అయినా కూడా చదువును అశ్రద్ద చేయడం లేదు అంటూ ఆమె పేర్కొంది. మొత్తానికి శ్రీలీల ఎంబీబీఎస్‌ పూర్తి చేసి తీరుతాను అంటోంది.

చదువు సరిగా రాని వారు, ఏ పని చేత కాని వారు సినిమాల్లోకి వస్తారు అంటూ కొందరు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు అందరికి కూడా శ్రీలీల సమాధానం అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌ గా శ్రీలీల ఇంత బిజీగా ఉన్నా కూడా చదువుకుంటూ, కాలేజ్‌ కి వెళ్తూ పరీక్షలు రాస్తుందట.

నిజంగా ఈమె చాలా మందికి ఆదర్శం అనడంలో సందేహం లేదు. శ్రీలీల యొక్క గొప్ప పట్టుదలకు ఆమె యొక్క చదువుపై ఆసక్తికి ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. గొప్ప హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్నా కూడా డాక్టర్‌ గా వచ్చే సంతృప్తి రాదని శ్రీలీల తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.