Begin typing your search above and press return to search.

శ్రీదేవి..జ‌య‌ప్ర‌ద రేంజ్ కి శ్రీలీల‌!

ఆమె ఎన‌ర్జీ లెవ‌ల్స్ చూస్తుంటే జ‌య‌ప్ర‌ద‌..జ‌సుద రేంజ్ కి వెళ్తుంద‌ని ఈ మ‌ధ్య‌నే నాతో ఓ అగ్ర నిర్మాత అన్నారు.

By:  Tupaki Desk   |   10 July 2023 4:45 AM GMT
శ్రీదేవి..జ‌య‌ప్ర‌ద రేంజ్ కి శ్రీలీల‌!
X

యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ తో దూసుకుపోతుంది. సీనియ‌ర్..జూనియ‌ర్స్ స్టార్స్ అంటూ ఎవ‌ర్నీ విడిచిపెట్ట‌డం లేదు. ఏ హీరోతో ఛాన్స్ వ‌చ్చినా సై అని ముందుకెళ్లిపోతుంది. ఓవైపు హీరోయిన్ గా న‌టిస్తూనే మ‌రోవైపు సిస్ట‌ర్ రోల్స్..సెకెండ్ లీడ్ లంటూ కెరీర్ ని ప‌రుగులు పెట్టిస్తుంది. అమ్మ‌డి తాజా లైన‌ప్ చూస్తే అంతా షాక్ అవ్వాల్సిందే. తెలుగు లో ఏ భామ లేనంత బిజీ గా ఉంది.

డే బై డే సొగ‌స‌రికి మార్కెట్లో మాస్ ఫాలోయింగ్ అంత‌కంత‌కు పెరిగిపోతుంది. స్టార్ హీరోయిన్ల లీగ్ కి అతి చేరువ‌ లో ఉంది. 'గుంటూరు కారం లో' ఛాన్స్ అందుకోవ‌డంతో కెరీర్ ప‌రంగా మ‌రో అడుగు ముదుకు ప‌డింది. ఈ సినిమా హిట్ త‌ర్వాత అమ్మ‌డి రేంజ్ మారిపోతుంద‌ని ప్ర‌చారం షురూ అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా శ్రీలీల గురించి ఓ అగ్ర నిర్మాత ఏమ‌నుకుంటున్నాడో? న‌టుడు బ్ర‌హ్మాజీ రివీల్ చేసి షాక్ ఇచ్చారు.

ప్ర‌స్తుతం బ్ర‌హ్మాజీ 'స్లమ్ డాగ్ హస్బెండ్' రిలీజ్ నేప‌థ్యంలో ప్ర‌చారం లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఓ ఇంటర్వూలో శ్రీలీల గురించి ఇలా మాట్లాడారు. మ‌ళ్లీ మీకు హీరో గా ఛాన్స్ వ‌స్తే ఏ హీరోయిన్ తో న‌టిస్తారు? అంటే శ్రీలీల అయితే బాగుంటుంద‌ని మ‌న‌సు లో మాట బ‌య‌ట‌పెట్టారు. ఆ అమ్మాయి డాన్సులు బాగా చేస్తుంది. డాన్సులు నాకు రావ‌ని అనుకుంటున్నారామో.

నేను కూడా బాగానే చేస్తాను. శ్రీలీల చాలా వేగంగా స్టార్ డ‌మ్ అందుకుంది. ఆమె ఎన‌ర్జీ లెవ‌ల్స్ చూస్తుంటే జ‌య‌ప్ర‌ద‌..జ‌సుద రేంజ్ కి వెళ్తుంద‌ని ఈ మ‌ధ్య‌నే నాతో ఓ అగ్ర నిర్మాత అన్నారు. ఆయ‌న అన్న‌ది జ‌ర‌గాల‌ ని మ‌న‌సారా కోరుకుంటున్నాను. మా సినిమా ప్రీ రిఈజ్ ఈవెంట్ ఈనెల 27న జ‌రుగుతుంది. ఈవెంట్ కి శ్రీలీల వ‌స్తుంది. ఆమెతో క‌లిసి అప్పుడు డాన్సులు చేస్తాను' అని న‌వ్వేసారు.