Begin typing your search above and press return to search.

ఆ కారణంగా షూటింగ్ కి దూరంగా శ్రీలీల..!

శ్రీలీల మెడిసిన్ చదువుతున్న విషయం తెల్సిందే. ప్రతి ఏడాది ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ పరీక్షలకు శ్రీలీల హాజరు అవుతూనే ఉంది.

By:  Tupaki Desk   |   18 Dec 2023 6:29 AM GMT
ఆ కారణంగా షూటింగ్ కి దూరంగా శ్రీలీల..!
X

టాలీవుడ్‌ లో ప్రస్తుతం టాప్‌ హ్యాపెనింగ్‌ హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేర్లలో శ్రీలీల పేరు ముందు ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గా ఆమె చేస్తున్న సినిమాల సంఖ్య అంతా ఇంతా కాదు. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన శ్రీలీల ధమాకా తో హిట్ కొట్టి ఇటీవల భగవంత్‌ కేసరి తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. రోజుకు రెండు షిఫ్ట్ లు షూటింగ్‌ కు శ్రీలీల హాజరు అవుతుందనే వార్తలు ఆ మధ్య వచ్చాయి. అంతగా బిజీగా ఉన్న శ్రీలీల వారం నుంచి పది రోజుల పాటు షూటింగ్స్ కి పూర్తిగా దూరంగా ఉండబోతుంది. ఆమె ఈ వారం పది రోజుల పాటు కనీసం మీడియా కి కూడా కనిపించబోదు అంటూ ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

శ్రీలీల మెడిసిన్ చదువుతున్న విషయం తెల్సిందే. ప్రతి ఏడాది ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ పరీక్షలకు శ్రీలీల హాజరు అవుతూనే ఉంది. ఇప్పుడు కూడా షూటింగ్స్ కి బ్రేక్ చెప్పి ఎంబీబీఎస్‌ పరీక్షలు రాస్తున్నట్లుగా తెలుస్తోంది. షూటింగ్‌ బ్రేక్‌ సమయంలో చదువుతూ కనిపించే శ్రీలీల కొత్త ఏడాది లో మళ్లీ షూటింగ్స్ కు ఎప్పటిలాగే హాజరు అవ్వబోతుందట.

హీరోయిన్ గా స్టార్‌ డమ్‌ దక్కినా కూడా తనకు మెడిసిన్ పై ఉన్న మక్కువతో వదిలి పెట్టకుండా పరీక్షలు రాస్తూ, కష్టపడి చదువుతున్న శ్రీలీలను నెటిజన్స్ మరియు ఆమె అభిమానులు చదువుల తల్లి అంటున్నారు. హీరోయిన్‌ గా మంచి పేరు వచ్చినా కూడా డాక్టర్ అవ్వాలి అన్నది తన కోరిక అంటూ శ్రీలీల ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

హీరోయిన్‌ గా బ్యాక్‌ టు బ్యాక్‌ ఫ్లాప్స్ పడ్డా కూడా శ్రీలీలకు కొత్త ఆఫర్లు దక్కుతూనే ఉన్నాయి. ఆది కేశవ మరియు స్కంద సినిమాలు కూడా హిట్ అయ్యి ఉంటే ఈ అమ్మడు టాలీవుడ్‌ లో మరింత బిజీగా మారి ఉండేది. అత్యధిక పారితోషికం తీసుకుంటూ ఫుల్‌ బిజీగా ఉన్న శ్రీలీల ముందు ముందు అయినా ధమాకా వంటి విజయాలను సొంతం చేసుకుంటుందేమో చూడాలి.